ఇది పిచ్చి మొక్క కాదు ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

గంగ పాయల ఆకు కూరని గంగ పాయ, గోళీ కూర అని కూడా అంటారు.ఇందులో సన్న పాయల, పుల్ల పాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల అని నాలుగు రకాలు ఉన్నాయి.

 Ganga Payala Aaku Uses And Health Benefits-TeluguStop.com

ఈ మొక్కను దాదాపుగా అందరు చూసే ఉంటారు.ఈ మొక్క ఎక్కువగా పల్లెటూరు లలో మరియు పొలాల గట్ల మధ్య ఉంటుంది.

ఇది నెల మీద పాకుతుంది.కాడలు ఆకులు చాలా దళసరిగా ఉంటాయి.

పసుపు పచ్చ పూలు పూస్తాయి.గంగ పావిలి కూర పుల్లగా ఉంటుంది.

ఇది సులభంగా పెరుగుతుంది.గంగ పావిలి ఆకుతో కూర, పప్పు చేసుకుంటారు.

ఈ ఆకులో చాలా పోషకాలు ఉన్నాయి.వాటి గురించి తెలిస్తే వదలకుండా తింటారు.

ఇందులో పీచు పదార్ధం,ఒమేగా ౩ ఫాటి ఆమ్లాలు, విటమిన్ A ,విటమిన్ బి పీచు పదార్ధం మరియు ఐరన్ ,పొటాషియం ,కాల్షియం పుష్కలంగా ఉంటాయి.అంతేకాక ఇందులో పవర్ ఫుల్ యాంటిఆక్సిడెంట్ లు ఉన్నాయి.

ఈ గంగ పాయల ఆకులు తినడం వల్ల ఇందులో ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు ఉండడం వల్ల మన శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది.రక్త ప్రహవానికి అడ్డు వచ్చే కొలెస్ట్రాల్ లేకపోవటం వలన గుండెకు మేలు జరుగుతుంది.

తరచూ ఈ ఆకులు ఏదో విధంగా తినడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

గంగ పాయిల్ల మొక్కలో జింక్ అధికంగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది

ఇందులో కాల్షియం ,పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఏముకలు దృడంగా ఉండేలాగా చేస్తుంది

నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది

అన్ని ఆకుకూరల్లో కన్నా ఈ గంగ పాయల ఆకుల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండుట వలన కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది

ఈ ఆకులో కేలరీలు తక్కువ పీచు పదార్ధం ఎక్కువగా ఉండుట వలన జీర్ణక్రియ బాగుంటుంది.

అలాగే బరువు తగ్గాలని అనుకునేవారికి కూడా మంచి ఆకుకూర.

ఈ ఆకు రసాన్ని గాయాలకు రాస్తే త్వరగా మానుతాయి.

చూసారుగా ఫ్రెండ్స్ ఈ ఆకుకూరను మీ ఆహారంలో భాగంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube