విజయవాడ లో గ్యాంగ్ వార్..!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని కి దగ్గరగా ఉండే విజయవాడ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తున్నాయి.మొన్న తాడేపల్లి ప్రాంతం వద్ద సీఎం నివాసం దగ్గరలో అత్యాచార ఘటన జరగడం.

 Gang War In Vijayawad-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విజయవాడలో రెండు గ్యాంగులు కర్రలతో దాడులు చేసుకున్నాయి.

విషయంలోకి వెళితే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బెజవాడ కి చెందిన కొంత మంది యువతీ యువకులు ఖిలేశ్వరా పురం లోని వాటర్ ఫాల్స్ కి వెళ్లడం జరిగింది.

 Gang War In Vijayawad-విజయవాడ లో గ్యాంగ్ వార్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో బెజవాడ ప్రాంతానికి చెందిన యువకులు స్థానిక యువకులతో గొడవ పడటం జరిగింది.

ఆ తర్వాత వాటర్ ఫాల్స్ నుండి యువతీయువకులు తిరిగి బెజవాడ ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఖిలేశ్వరా పురం లోకల్ కుర్రోళ్ళు ఇబ్రహీంపట్నం వద్ద కాపు కాచ విజయవాడ ప్రాంతానికి అనగా వాటర్ ఫాల్స్ వద్ద గొడవ పెట్టుకున్న వారిని కర్రలతో రాళ్లతో దాడి చేశారు.రెండు గ్యాంగ్ లకి చెందిన కుర్రాళ్లు రెచ్చిపోయారు.

రోడ్డు పక్కనే జరుగుతున్న జనాలు చూస్తున్నా గాని కుర్రవాళ్ళు ఎక్కడా తగ్గలేదు.జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో ఒక వ్యక్తి అపస్మారక స్థితికి వెళ్ళిపోగా.

మరికొంత మంది గాయాలపాలయ్యారు.దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ స్టార్ట్ చేసి యువకులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.

#GangWar #Vijayawada #Andra Pradesh #Ibrahimpatnam #AP Capital

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు