ఈ హిజ్రాల మ‌ధ్య గ్యాంగ్ వార్ ను చూస్తే సినిమాలు కూడా ప‌నికిరావేమో..!

గాలి చిలికి చిలికి పెద్ద వాన తెచ్చినట్లు చిన్న వివాదం కాస్తా పెద్దగా మారింది. హిజ్రాల మధ్య తలెత్తిన చిన్న గొడవ గ్యాంగ్ వార్‌కే దారి తీసింది.

 Gang War Between Bangalore Hijras And Rayalaseema Hijras-TeluguStop.com

పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకునేంత వరకు వెళ్లింది.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే? తెలియాంటే మీరు ఈ కథానాన్ని పూర్తిగా చదవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కేంద్రంగా రాయలసీమ హిజ్రాల సంఘం ఇటీవల ఆషాడ బోనాల పండుగ నిర్వహించింది.ఈ వేడుకలకు బెంగళూరుకు చెందిన హిజ్రాల సంఘం తరఫున కొందరు హిజ్రాలు అటెండ్ అయ్యారు.

 Gang War Between Bangalore Hijras And Rayalaseema Hijras-ఈ హిజ్రాల మ‌ధ్య గ్యాంగ్ వార్ ను చూస్తే సినిమాలు కూడా ప‌నికిరావేమో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో రాయలసీమ హిజ్రాలు, బెంగళూరు హిజ్రాల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఏర్పడింది.సక్యత వల్ల మంచి వాతావరణమే ఏర్పడింది.ఈ క్రమంలో ఏమైందో ఏమో తెలియదు.కానీ, రాయలసీమ బ్యాచ్ హిజ్రాల మధ్య విభేదాలు సృష్టించాలనుకున్నారు బెంగళూరు హిజ్రాలు.

రాయలసీమ బ్యాచ్ అందరూ ఒకేలా కలిసి ఉండటం బహుశా బెంగళూరు బ్యాచ్ వారికి నచ్చలేదు కావచ్చు.ఈ నేపథ్యంలోనే వారి మధ్య గొడవ సృష్టించాలనుకున్నారు.

ఈ క్రమంలోనే రాయలసీమ బ్యాచ్ లోని ఓ హిజ్రాను కిడ్నాప్ చేశారు.ఈ విషయం రాయలసీమ బ్యాచ్‌కి తెలియడంతో వారు రగిలిపోయారు.

తామేం తక్కువ తినలేదని ప్రతీకారంగా బెంగళూరు బ్యాచ్ హిజ్రాల్లో ఒకరిని కిడ్నాప్ చేశారు.ఇలా మొత్తంగా రెండు బ్యాచ్‌ల మధ్య గొడవ షురూ అయింది.

రాయలసీమ హిజ్రాలు అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు.తమ మనిషిని వదిలితేనే, అవతలి వైపు మనిషిని వదిలేస్తామని ప్రకటించారు.

అయితే, ఇలా వీరు ఆందోళనకు దిగే పరిస్థితులను గమనించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.శాంతి భద్రతలకు ఏ మాత్రం విఘాతం కలిగినా ఇరువర్గాలపై కఠిన చర్యలుంటాయని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

#Anantapur #Hijras Protest #Hijras War #GangWar #Gang War

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు