సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.రోజురోజుకు కామాంధుల ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయి.
ఇక దేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొచ్చినప్పటికీ వారిపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు.ఎదో ఒక్క ప్రాంతంలో కామాంధుల వికృత చేష్టలకు మహిళలు బలవుతూనే ఉన్నారు.
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో వివాహితపై ఆరుగురు సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.టిజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత జీవనం సాగిస్తుంది.అయితే గత గురువారం తన మేనల్లుడితో కలిసి అప్పు చెల్లించేందుకు సమీప గ్రామానికి బైక్‌పై వెళ్లారు.ఇక తిరుగు ప్రయాణంలో వారిని ఆరుగురు వ్యక్తులు అడ్డుకున్నారు.
ఆమె మేనల్లుడిని బాగా కొట్టి ఇద్దరిని పక్కనే ఉన్న గుట్ట వద్దకు వారిని లాక్కెళ్లి కట్టేశారు.ఆ తర్వాత ఆమెపై ఒక్కొక్కరు లైంగిక దాడికి పాల్పడ్డారు.
అంతేకాకుండా వారు చేసిన తతంగాన్నంతా వీడియో రూపంలో బంధించారు.ఈ విషయాన్ని బయటపెడితే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు.
బాధితురాలు ఇంటికి వచ్చాక జరిగిన విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది.బాధితురాలు, ఆమె భర్త కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటాం అని టిజారా డీఎస్పీ కుశాల్ అన్నారు.