దారుణం.. డబ్బు కోసం తల్లే దగ్గరుండి కూతురిపై..

ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటుండటం మనం చూస్తున్నాం.రోజురోజుకూ అవి ఇంకా పెరిగిపోతున్నాయి.

 Gang Rape On Girl Zirak Pur-TeluguStop.com

కాగా, తాజాగా ఓ దారుణ ఘటన పంజాబ్ బటిండాలో వెలుగు చూసింది.తల్లే కూతురును వ్యభిచార రొంపిలోకి నెట్టి కూతురుపై అత్యాచారానికి పలువురిని ఉసిగొల్పింది.

ఈ విషయమై తల్లిపై కూతురు ఫిర్యాదు చేయగా పోలీసులు తల్లిని ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.

 Gang Rape On Girl Zirak Pur-దారుణం.. డబ్బు కోసం తల్లే దగ్గరుండి కూతురిపై..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బటిండాలోని సివిల్ లైన్స్ కాలనీలో తల్లితో కలిసి 14 ఏళ్ల బాలిక ఉంటోంది.బాలిక తల్లి తొమ్మిదేళ్ల కిందట భర్తతో విడిపోయింది.

ఈ క్రమంలోనే ఇక్కడకు వచ్చింది.కాగా, డబ్బుల సంపాదన కోసం ఏదేని పని చేయకుండా సదరు మహిళ కూతురినే వ్యభిచార కూపంలోకి నెట్టింది.

తల్లియే దగ్గరుండి మరీ కూతురిపై అత్యాచారం చేయించి మనీ సంపాదించడం మొదలుపెట్టింది.ఇటీవల జిరాక్‌పూర్ హోటల్‌లో బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేశాడు.

సదరు బాలిక తల్లి ప్రోద్బలంతోనే దాడి జరగగా, తల్లి అరాచకలు తట్టుకోలేక బాలిక జిరాక్ పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక తల్లితో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ క్రమంలోనే పోలీసులు ఆ ఏరియాలో పలు ప్రాంతాలను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.

జిరాక్‌పూర్ హోటల్ నిర్వాహకులను సైతం అరెస్టు చేశారు.ఇకపోతే పధ్నాలుగేళ్ల బాధిత బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేశారు.

ఆమెకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు, ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్స్ పేర్కొన్నారు.బాలిక ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చాక ఆమెను చదివించే ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.

స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.సివిల్ లైన్స్ కాలనీలో తల్లి కూతురు ఇలా చేసిందంటూ చర్చించుకుంటున్నారు.

తల్లి డబ్బుల కోసం కూతురిని ఇలా చేయడం ద్వారా మాయని మచ్చను తనపైన వేసుకుందని అనుకుంటున్నారు.

#Zirak Pur #Mother #Gang #Gang #Zirak Pur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు