సమాజంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.ఇలా కూడా చేయొచ్చా అని జనం ముక్కున వేలేసుకునేలా దారుణాలు జరుగుతున్నాయి.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ ప్రభావం సమాజంపై ఎక్కువగా పడుతోంది.నేరాలు ఎలా చేయాలో, దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో వీటిని చూసి జనం నేర్చుకుంటున్నారు.
తాజాగా ఇంగ్లాండ్‌లో( England ) ఓ భారత సంతతి వ్యక్తిని పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చిందో గ్యాంగ్.ఇందుకోసం ‘‘వలపువల (హనీట్రాప్) ’’ను ఆయుధంగా వాడింది.
ఈ నేరానిగాను ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను కోర్ట్ దోషులుగా తేల్చింది.

వివరాల్లోకి వెళితే .మృతుడు విశాల్ గోహెల్ (44)( Vishal Gohel ) జనవరిలో హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని ఓ ఫ్లాట్‌లో విగత జీవిగా కనిపించాడు.పోస్ట్‌మార్టం రిపోర్టులో అతని తలకు బలమైన దెబ్బలు తగిలినట్లు తేలింది.
యూకే మీడియా నివేదికల ప్రకారం.శుక్రవారం సెయింట్ అల్బన్స్ క్రౌన్ కోర్టులోని జ్యూరీకి గోహెల్‌కు ఓ మహిళతో లైంగిక సంబంధం కూడా వుందని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఇందులో హనీ ట్రాప్( Honeytrap ) కోణం వుందని తేలింది.బెడ్‌ఫోర్డ్‌షైర్, కేంబ్రిడ్జ్‌షైర్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్ (బీసీహెచ్) మేజర్ క్రైమ్ యూనిట్ అధికారులు హత్య కేసు దర్యాప్తును ప్రారంభించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

గోహెల్ తన ఫ్లాట్‌లో ముఖానికి టేప్‌తో కనిపించాడు.ఇంటి తలుపు తెరిచి వుండటం, వంటగదిలో లైట్ వేసి వుండటాన్ని ఇరుగుపొరుగు గమనించారు.వస్తుసేవలు అందించే క్రైగ్స్ లిస్ట్ ద్వారా గోహెల్ అనుమానితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.టెవిన్ లెస్లీ (23)( Tevin Leslie ) ఈ హత్యకు పాల్పడినట్లుగా నేరాన్ని అంగీకరించాడు.
సకీన్ గోర్డాన్ (22) హత్య, దోపిడీకి కుట్ర పన్నినట్లుగా నిర్ధారించారు.యార్లీ జార్జియా బ్రూస్ అన్నన్ (22), బ్రాండన్ బ్రౌన్ (22), ఫెయిత్ హాప్పి (22)లపైనా అభియోగాలు మోపారు.
సెప్టెంబర్ 26న వీరికి సెయింట్ ఆల్బన్స్ క్రౌన్ కోర్టులో ఐదుగురికి శిక్షలు ఖరారు చేయనున్నారు.ఈ కేసులో ఆరవ నిందితురాలు టియానా ఎడ్వర్డ్స్ హాన్కాక్ (20)పై తొలుత హత్య, దోపిడీ కేసులు నమోదు చేయబడినపట్టి.
తర్వాత క్లీన్ చీట్ లభించింది.