సైబరాబాద్ బాలానగర్ SOT మరియు మేడ్చల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో, పెట్రోల్ బంక్‌లలో చీటింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశామని బాలా నగర్ డీసీపీ పద్మజ తెలిపారు.పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మూడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేశాము.
పెట్రోల్ బంక్ లో సాఫ్ట్ వేర్ లను మార్చి మోసం చేస్తున్నారు.తెలంగాణ, ఏపీ, కర్ణాటక లో కలిసి 34 పెట్రోల్ బంక్ లలో మైక్రో చిప్ ల ద్వారా మోసం చేసినట్లు విచారణ లో తేలింది.
ఫైజుల్ బారి , సందీప్, ఎండీ అస్లం ముగ్గురు పథకం ప్రకారం మోసం చేస్తున్నారు.మైక్రో చిప్స్ పెట్టిన నలుగురితో పాటు పెట్రోల్ బంక్స్ యజమానులు నలుగురిని అరెస్ట్ చేశాం.
గతంలో పెట్రోల్ బంక్ లో పని చేసిన అనుభవం ఉండడంతో ఈజీ గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తో మోసం చేస్తున్నారు.మిషన్ ను ట్యాపరింగ్ చేసి ఓ మైక్రో చిప్ పెట్టి మోసం చేస్తున్నారు.
లీటర్ కి 30 ML వరకు తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేసి మోసం చేస్తున్నారు.ఇలా మైక్రో చిప్ ను రెండు లక్షలు రూపాయలకు పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులకు అమ్మకాలు చేశారు.
ఇలా వచ్చిన డబ్బుతోటి ఈ ముఠా ఒప్పందం ప్రకారం పంచుకుంటున్నారు.ఈ ముఠా పై 6 కేసులు నమోదు చేశాము జీడిమెట్ల, మైలార్ దేవుల పల్లి, మేడ్చల్ , జవహర్ నగర్ లో కేసులు నమోదు చేశాము.
కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం , సిద్ధి పేట్, నెల్లూరు , సూర్య పేట్ లో ఇలా మోసం చేస్తున్నారు.కర్ణాటక , ఏపీ లో కూడా ఇలా చిప్ లు అమ్మకాలు చేస్తూ పబ్లిక్ ను మోసం చేస్తున్నారు.
పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానాలు నలుగురిని అరెస్ట్ చేశాము.నాలుగు నెలలుగా ఈ మోసం చేస్తున్నారు.మరోసారి ఈ ముఠా ను కష్టడీ లోకి తీసుకొని విచారిస్తే , మరిన్నీ విషయాలు బయట పడతాయి.పెట్రోల్ బంకుల్లో పబ్లిక్ కి తక్కువగా వస్తుంది అనే అనుమనమొస్తే… మేజర్ మాప్ తో కొలిచి చూపించమని అడిగే హక్కు పబ్లిక్ కి ఉంది.