దండకారణ్యంలో వినాయకుడు.. 13 వేల అడుగుల ఎత్తులో !

దేశంలో ఎన్నో గణపతి దేవాలయాలు ఉన్నా.దట్టమైన అడవులు, కొండలు, కోనలు మధ్య ఓ పెద్ద కొండపై వినాయకుడు ఉంటే.ప్రకృతి ప్రేమికులకు పండగే.1100 ఏళ్ల చరిత్ర కలిగిన నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

 Chhattisgarh, Bastar Forest Area, Hills, Forest, Ganesh, 1100-year-old Ganesha I-TeluguStop.com

ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో దర్శనమిస్తుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ పరిధిలో ఈ అటవీ ప్రాంత విస్తరించి ఉంటుంది.ఈ ప్రాంతంలో మావోయిస్టులు అధికంగా ఉంటారు.ఈ దట్టమైన అర్యణంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి విగ్రహం ఉంది.వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ వినాయకుడు ఈ దట్టమైన ప్రాంతంలో ఉండటంతో అసలు అలాంటి విగ్రహం ఉందని ప్రపంచానికి తెలియదు.2102లో స్థానిక జర్నలిస్ట్ ఈ దోల్ కల్ కొండ గుర్తించాడు.కొండపైన ఆరు అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహం కనిపించింది.13 వేల అడుగుల ఎత్తున్న ఈ కొండ ప్రాంతానికి చేరుకోవడం అంత తేలిక కాదు.ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా దంతెవాడ గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 20 కి.మీ.దూరంలో ఉన్న మిడ్ కుల్నర్ గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి అడవిలో 7 కిలో మీటర్లు నడవాలి.కొండలు, గుట్టలు నడుస్తూ వెళ్తుంటే తప్ప వినాయకుడు ఉన్న ప్రదేశాన్ని చేరుకోలేమని ఆ జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube