వినాయక నిమజ్జనం ఏ సమయంలో చేయాలో తెలుసా?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.వినాయక చవితి సందర్భంగా ప్రతి ఊరిలోనూ, వాడ వాడలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో, నైవేద్యాలతో స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించే అనంతరం వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తాము.

 Ganesh Visarjan 2021 Date Shubh Muhurat And Know The Time For Ganpati Visarjan Ganesh, Ganesh Visarjan, Shubh Muhurat, Pooja , Sep 19 , Nine Days , Ganesha Nimarjanam-TeluguStop.com

అయితే కొందరు ఒక రోజుకు నిమర్జనం చేయగా మరికొందరు మూడు,ఐదు,తొమ్మిది, 11 రోజులకు ఇలా ఎవరికి అనుగుణంగా వారు నిమజ్జనం చేస్తుంటారు.

ఈ విధంగా వినాయక చవితి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు చేసి నిమర్జనం చేయడం సర్వసాధారణం.

 Ganesh Visarjan 2021 Date Shubh Muhurat And Know The Time For Ganpati Visarjan Ganesh, Ganesh Visarjan, Shubh Muhurat, Pooja , Sep 19 , Nine Days , Ganesha Nimarjanam-వినాయక నిమజ్జనం ఏ సమయంలో చేయాలో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ నిమజ్జన కార్యక్రమాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు.మరి నిమజ్జనం చేయడానికి సరైన సమయం ముహూర్తం ఏది అనే విషయానికి వస్తే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలలో కేవలం తొమ్మిది రోజులు మాత్రమే దైవత్వం ఉంటుంది.

ఆ తర్వాత ఆ విగ్రహాలకు ఏ విధమైనటువంటి దైవ శక్తులు ఉండవని పండితులు చెబుతున్నారు.అందుకే వినాయక ప్రతిమలను తొమ్మిది రోజులకు నిమజ్జనం చేయడం ఎంతో శ్రేయస్కరమని పండితులు తెలియజేస్తున్నారు.

Telugu Ganesh, Ganesh Visarjan, Days, Pooja, Sep, Shubh Muhurat-Telugu Bhakthi

హిందూ క్యాలెండర్ ప్రకారం గణేష్ నిమర్జనం చతుర్దశి రోజున జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.వచ్చే ఏడాది మళ్లీ వస్తానని చెబుతూ గణేష్ నిమజ్జనం చేస్తారు.హిందూ పంచాంగం ప్రకారం గణేష్ నిమజ్జనానికి చతుర్దశి అనగా 19వ తేదీ మధ్యాహ్నం 12:14 నిమిషాల నుంచి సాయంత్రం 7:39వరకు స్వామి వారి ప్రతిమలను నిమజ్జనం చేయడానికి ఎంతో శుభముహూర్తం అని పండితులు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube