సాగర ఒడికి చేరిన మహాగణపతి  

Khairathabadh Ganesh Immersion-

తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం, ప్రాముఖ్యత ఉన్న ఖైరాతాబాద్‌ గణేషుడు ఈసారి చాలా ముందుగానే సాగరంలో నిమజ్జనం అయ్యాడు.మామూలుగా కొన్ని సార్లు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నిమజ్జనం అయిన సందర్బాలు ఉన్నాయి.కాని ఈసారి మాత్రం మద్యాహ్నం సమయంకే భారీ గణనాధుడు నిమజ్జనం అవ్వడం జరిగింది...

Khairathabadh Ganesh Immersion--Khairathabadh Ganesh Immersion-

మహాగణపతి శోబాయాత్ర గతంతో పోల్చితే కాస్త స్పీడ్‌గా సాగింది.ఖైరతాబాద్‌ మండపం నుండి తెలుగు తల్లి విగ్రహం పక్క నుండి మెల్లగా మహాగణపతి శోభయాత్ర సాగింది.

61 అడుగుల ఎత్తు, 45 టన్నుల బరువు ఉన్న ఏక దంత గణనాధుడు సాగరంలో నిమజ్జనం అయ్యాడు.దాంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.

Khairathabadh Ganesh Immersion--Khairathabadh Ganesh Immersion-

ప్రతిసారి కూడా మహాగణపతి నిమజ్జనం అయ్యే వరకు అంతా టెన్షన్‌ వాతావరణం ఉంటుంది.ఈసారి ఉత్సవ కమిటీ వారితో కలిపి పోలీసులు తక్కువ సమయంకే శోభాయాత్ర ముగించడంతో పాటు ప్రశాంతంగా గణపతి నిమజ్జనం జరిపించారు.మహాగణపతి నిమజ్జనం చూసేందుకు హుస్సేన్‌ సాగర్‌ వద్దకు కొన్ని వేల మంది చేరుకున్నారు.