హీరోగా "గణేష్ బెల్లంకొండ" పరిచయ చిత్రం ''స్వాతిముత్యం'' ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం.

వెండితెరకు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నారు.అతని పేరు “గణేష్ బెల్లంకొండ” ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు ఈ ‘గణేష్’.

 Ganesh Bellamkonda Debut Movie Swathimuthyam First Look Poster-TeluguStop.com

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘గణేష్’ ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తోంది.యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ, ‘గణేష్‘ హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం‘ అనే పేరును నిర్ణయించారు.

ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రంను కూడా విడుదల చేశారు.ఈ ప్రచార చిత్రంలో కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది.

 Ganesh Bellamkonda Debut Movie Swathimuthyam First Look Poster-హీరోగా గణేష్ బెల్లంకొండ పరిచయ చిత్రం స్వాతిముత్యం ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆకర్షణీయమైన లోగో తో కూడిన చిత్రం పేరు కనిపిస్తుంది.ఈరోజు చిత్ర కథానాయకుడు పుట్టినరోజు.ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు.

‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక.లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఆయన మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం.

జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం.కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి.ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి.సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.

ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

Telugu Bellam Konda Suresh, Bellmkonda Srinivas Brother, Debut Movie, First Look Poster Released, Ganesh Bellamkonda, Heroine Varsha Bollemma, Producer Sruyadevara Nagavamshi, Sitara Entertainments, Swathimuthyam, Tollywood-Movie

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

స్వాతిముత్యం‘ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్ ఛాయా గ్రహణం: సూర్య ఎడిటర్: నవీన్ నూలి కళ: అవినాష్ కొల్ల పి.ఆర్.ఓ.లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ

.

#Poster #BellamKonda #Varsha Bollemma #Debut #Swathimuthyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు