గాంధీజీ హెల్త్‌ రికార్డ్‌ : ఇన్నేళ్ల తర్వాత బయటకు వచ్చిన ఆయన జబ్బుల చిట్టా  

Gandhi\'s Health Records Are Published-gandhi Weight

జాతి పిత మహాత్మ గాంధీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి దేశానికి శాంతి యుత పద్దతిలో, రక్త పాతం జరుగకుండా స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన విషయం తెల్సిందే. జాతి పితగా మారిన గాంధీజీ ఏడు పదుల వయసులో కూడా అప్పట్లో గాంధీజీ పదుల కిలోమీటర్లు నడవడంతో పాటు, చాలా ఉత్సాహంగా ఉండే వారు. గాంధీజీకి సంబంధించిన కొన్ని వీడియోలను చూస్తున్న సమయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంది..

గాంధీజీ హెల్త్‌ రికార్డ్‌ : ఇన్నేళ్ల తర్వాత బయటకు వచ్చిన ఆయన జబ్బుల చిట్టా-Gandhi's Health Records Are Published

అంత బక్క మనిషి అంత స్పీడ్‌గా నడుస్తూ, ముసలి వయసులో అంత బలంగా ఎలా ఉండేవారని అనిపిస్తుంది. గాంధీజీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని కారణంగా ఆయన అంత ఉత్సాహంగా ఉండేవారు అని అంతా అనుకుంటారు. కాని గాంధీజీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడ్డారట.

ఆ విషయం తాజాగా ఒక బుక్‌ ద్వారా వెళ్లడయ్యింది.

గాంధీజీ అనారోగ్య సమస్యలు.

గాంధీజీ హెల్త్‌ ఎట్‌ 150 అనే పుస్తకంను ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకంలో గాంధీజీ ఎప్పుడు ఏ అనారోగ్యంతో బాధ పడ్డారు, ఎప్పుడు ఏ ఆపరేషన్‌ను చేయించుకున్నారు అనే విషయాలు పూర్తిగా ఉన్నాయి. గాంధీజీ చనిపోయే సమయంలో 47.7 కేజీల బరువు ఉండేవారు. ఆయన ఎత్తుకు బరువుకు మ్యాచ్‌ కాలేదు. ఆయన ఎత్తు ఐడు అడుగుల ఐదు అంగులాలు ఉండేది.

ఆ హైట్‌కు కనీసం 50 నుండి 55 కేజీల బరువు ఉండాల్సి ఉంటుంది. కాని గాంధీజీ తక్కువ బరువు ఉండే వారు. ఇది పెద్ద సమస్య కాకున్నా కూడా ఒక ఆనారోగ్య సమస్యగా వారు చెబుతున్నారు. ఇక గాంధీజీకి మూడు సార్లు మలేరియా ఫీవర్‌ వచ్చింది.

ఆ సమయంలో ఆయన చికిత్స తీసుకున్నారు.

1919లో పైల్స్‌కు, 1924లో అపెండెక్స్‌కు ఆపరేషన్స్‌ చేయించుకున్నారు. లండన్‌కు చదువుకునేందుకు వెళ్లిన సమయంలో గాంధీజీ అక్కడ సరైన ఆహారం దొకరక పోవడంతో వింత వింత పదార్థాలు తినాల్సి వచ్చింది. దాంతో గాంధీజీకి గ్యాస్‌ ట్రబుల్‌ ప్రారంభం అయ్యింది.

ఛాతిలో మంట అంటూ లండన్‌లోనే కొన్ని సార్లు హాస్పిటల్‌కు వెళ్లారు. ఇక ఎక్కువగా ఉపవాసాలు ఉండటం వల్ల ఆయన అల్సర్‌ సమస్యతో కూడా బాధపడ్డారు. ఉపవాసాల కారణంగా కొన్ని సార్లు ఆయన మరణం వరకు వెళ్లారని బుక్‌లో పేర్కొన్నారు..

గాంధీజీ ఒకానొక సమయంలో ఈసీజీ తీయించుకున్నారు. ఆ సమయంలో గుండెకు ఎలాంటి సమస్య లేదని రిపోర్ట్‌ వచ్చింది. పలు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని బయటకు రానివ్వకుండా దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ పాల్గొన్నారు.

ఆయన తన ఆరోగ్యం లెక్క చేయకుండా పోరాడటం వల్లే ఇప్పుడు మనం స్వాతంత్య్ర గాలులు పీలుస్తున్నాం.