గాంధీ 150 జయంతి స్పెషల్‌ : గాంధీ గురించి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి

భరతమాత దాస్య శృంఖలాలు తెంచిన స్వాతంత్య్ర సమరయోధులు కొన్ని లక్షల మంది ఉన్నారు.అయితే వారందరిని ఏకతాటిపై నడించిన వ్యక్తి మోహన్‌ దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ.

 Gandhichanged As Mahatma And Jathipitha-TeluguStop.com

సుదీర్ఘ భానిసత్వంకు అలవాటు పడిపోయిన జనాలకు, ప్రజలకు స్వాతంత్య్రంపై ఆసక్తిని కలిగించి, పోరాటంకు ముందుకు వచ్చేలా చేసిన గాంధీ 150వ జయంతి నేడు.ఈ సందర్బంగా ఆయన్ను మరోసారి తలుచుకోవడం, ఆయన గొప్పతనంను ఈ తరం వారికి తెలియజేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

ఒక సామాన్యమైన వ్యక్తి అసమానమైన పోరాటపటిమతో మహాత్ముడిగా, జాతిపితగా ఎలా ఎదిగారు అనేది ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో, ఆయన లైఫ్‌ హిస్టరీల్లో చూశాం.

Telugu Gandhi Ji, Gandhi, Gandhi Janthi, Jathipitha, Mohandas, Oct, Gandhiji-Ins

మహాత్మగాంధీలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన క్వాలిటీ ఆయన సింప్లి సిటీ.ఎంత ఎత్తుకు ఎదిగినా సింపుల్‌గా ఉండటం, ఆడంబరాలకు వెళ్లకుండా ఉండటం ఆయనకు అలవాటు.ఆయన తలుచుకుంటే అప్పట్లోనే బాగా సంపాదించేవారు.

కాని ఆయన స్వాతంత్య్రం కోసం చాలా వదులుకున్నారు.గాంధీజీలో ఉన్న మరో ముఖ్యమైన క్వాలిటీ ఏంటీ అంటే ఆయనకు స్వీయ నియంత్రన చాలా ఎక్కువ.

తనకు తాను నియంత్రించుకున్న వారు ఏదైనా సాధిస్తారని అంటారు.అందుకే తనను తాను అన్ని విధాలుగా నియంత్రించుకోవడంలో గాంధీజీ ఎన్నో సార్లు సక్సెస్‌ అయ్యారు.

అందుకే ఇప్పుడు జాతికి పిత అయ్యారు.

Telugu Gandhi Ji, Gandhi, Gandhi Janthi, Jathipitha, Mohandas, Oct, Gandhiji-Ins

తాను చేసిన, చేస్తున్న లోపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తనకు తానుగా దిద్దుకుంటూ ఉండే వ్యక్తిత్వం గాంధీజీది.తప్పు చేయని వారు అంటూ ఉండరు.కాని ఆ తప్పు తెలిసినప్పుడు మళ్లీ మళ్లీ చేయకుండా ఉన్న వారే గొప్పవారు.

గాంధీజీ కూడా ఒక్కసారి జరిగిన తప్పును మళ్లీ జరగనిచ్చేవారు కాదు.ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉంటూ తన వల్ల ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉండాలని భావిస్తు ముందు తరం వారికి ఒక అద్బుతమైన ప్రపంచంను ఇవ్వాలని ఎప్పటికప్పుడు పరితపించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మహాత్మ గాంధీ.

Telugu Gandhi Ji, Gandhi, Gandhi Janthi, Jathipitha, Mohandas, Oct, Gandhiji-Ins

సత్యశోదనలో ఎప్పటికప్పుడు తన మీద, తన వారి మీద తన చుట్టు పక్కల ఉన్న వారి మీద ప్రయోగాలు చేశారు.ఆయన తెలుసుకున్న విషయాలు భవిష్యత్తు తరాలకు బంగారు బాటను వేశాయి.ఆయన చెప్పిన సూక్తులు మరియు మోటివేషన్‌ మాటలు ఎంతో మంది యువతరం సక్సెస్‌ దారిలో నడిచేలా చేసింది.భవిష్యత్తు తరాలకు ఎప్పటికప్పుడు గొప్ప వ్యక్తిత్వం కలిగించిన వ్యక్తి మహాత్మగాంధీ.

స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఏ ప్రభుత్వమో లేదంటే ఆయన సన్నిహితులో జాతిపిత ఇచ్చిన బిరుదు కాదు.

Telugu Gandhi Ji, Gandhi, Gandhi Janthi, Jathipitha, Mohandas, Oct, Gandhiji-Ins

ప్రజల్లో ఆయన కలిగించిన చైతన్యంకు ప్రజల నుండి వచ్చిన బిరుదు జాతిపిత.మహాత్మ అన్నా.జాతిపిత అన్నా కూడా ఆయన వ్యక్తిత్వంను చూపేవిధంగా ఉంటాయి.

భారతరత్న అవార్డు ఇవ్వాలనుకున్నా ఆయన సున్నితంగా తిరష్కరించారు.ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిత్వం పరిశీలించినట్లయితే గాందేయ వాదంను కలిగి ఉంటారు.

గాంధేయ వాదం కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కనిపిస్తుందంటే ఆయన గొప్పతనంను అర్థం చేసుకోవచ్చు.

Telugu Gandhi Ji, Gandhi, Gandhi Janthi, Jathipitha, Mohandas, Oct, Gandhiji-Ins

ఆయన విధానాలు, ఆయన వాదనలు, ఆయన పద్దతులు, ఆయన కష్టపడే తత్వం, అంతా నావారు అనుకునే తత్వం కారణంగా ఆయన జాతిపిత, మహాత్ముడు అయ్యాడు.150వ జయంతి జరుపుకుంటున్నా ఇంకా గాంధీజీని మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తల్చుకుంటున్నారంటే ఆయన సాధించింది ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మరో 150 ఏళ్లు అయినా కూడా గాంధీ క్రేజ్‌ మాత్రం తగ్గదని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube