అమెరికా: 21వ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గాంధీ డాక్యుమెంటరీకి అవార్డ్

భారత జాతిపిత మహాత్మాగాంధీపై రూపొందించిన డాక్యుమెంటరీకి 21వ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డ్ వరించింది.దక్షణాఫ్రికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన ప్రఖ్యాత చిత్రనిర్మాత అనంత్ సింగ్ వీడియో విజన్ బ్యానర్‌పై ఈ డాక్యుమెంటరీని నిర్మించారు.

 Gandhi Documentary Wins Top Award At New York Indian Film Festival, Ramesh Sharm-TeluguStop.com

రమేశ్ శర్మ దర్శకత్వం వహించారు.మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని 2019లో ‘‘అహింసా గాంధీ: ది పవర్ ఆఫ్ ది పవర్‌లెస్’’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.అయితే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 విజృంభణ కారణంగా దీని విడుదల ఆలస్యమైంది.

దర్శకుడు రమేశ్ శర్మ మాట్లాడుతూ.

ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డును అందుకున్నందుకు గౌరవంగా ఉందన్నారు.ఈ అవార్డు గాంధీ బోధనల యొక్క ప్రాముఖ్యత, ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటాలపై ఆయన ప్రభావాన్ని ధృవీకరిస్తుంది.

ఈ డాక్యుమెంటరీ ద్వారా గాంధీ వారసత్వాన్ని శాశ్వతం చేయడం తమకు చాలా ఆనందంగా ఉందని శర్మ అన్నారు.

మరోవైపు ఈ ప్రాజెక్ట్‌పై రమేశ్ శర్మతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా వుందన్నారు నిర్మాత అనంత్ సింగ్.

గాంధీ వారసత్వం ప్రపంచవ్యాప్తంగా వున్నప్పటికీ.దక్షిణాఫ్రికాతో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది.

ఇక్కడ గాంధీజీ మానవహక్కులు, సమానత్వ సమస్యలపై పోరాడారని సింగ్ గుర్తుచేశారు.గాంధీ అహింస, శాంతి వంటి అంశాలు భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.

గతేడాది జూన్ 7న డాక్యుమెంటరీ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు అనంత్ సింగ్ ప్రకటించారు.ఇది 1893లో గాంధీని దక్షిణాఫ్రికాలోని పీటర్‌మరిట్జ్‌బర్గ్‌ స్టేషన్ వద్ద రైలులో నుంచి తోసివేసిన రోజు.

నల్లజాతీయులపై శ్వేతజాతీయుల వివక్షకు వ్యతిరేకంగా ఈ సంఘటన జీవితకాల పోరాటానికి ప్రేరణను ఇచ్చింది.

Telugu Ahimsagandhi, Anant Singh, Arun Gandhi, Documentary, Rajmohan, Ramesh Sha

ఈ డాక్యుమెంటరీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, విద్యావేత్తలు గాంధీ తమపై చూపిన ప్రభావంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న గాంధీ మనవరాలు ఎలా గాంధీ, అమెరికాలో స్థిరపడిన ఆయన మనవళ్లు అరుణ్ గాంధీ, రాజ్‌మోహన్ గాంధీలు కూడా తమ అభిప్రాయాలు తెలిపారు.ఈ డాక్యుమెంటరీలో అమెరికన్ బ్లాక్ సివిల్స్ రైట్స్ ఉద్యమంపై గాంధీ బోధనల ప్రభావంపైనా వెల్లడించారు.

నాటి ఉద్యమంలో పాల్గొన్న పలువురు సీనియర్ సిటిజన్స్ అమెరికాలో జాత్యహంకార చరిత్రను గుర్తుచేసుకున్నారు.మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జాన్ లూయిస్, బరాక్ ఒబామా‌ల అభిప్రాయాలతో పాటు పోలాండ్‌లోని సాలిడారిటీ ఉద్యమం, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా జరిపిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాటం గురించి ఈ డాక్యుమెంటరీలో వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube