తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికైన రేవంత్ రెడ్డి తన మార్క్ మార్పులను చేయాలని చూస్తున్నారు.జూలైన్ 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ నేపథ్యంలో గాంధీ భవన్ ఓ పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది.వాస్తు సిద్ధాంతం ప్రకారం కొత్త మార్పులు జరుగుతున్నట్టు సమాచారం.
గాంధీ భవన్ లో కాంగ్రెస్ పతాకాలు విక్రయించే గదితో పాటు, భద్రతా సిబ్బందిని తొలగించనున్నారని తెలుస్తుంది.ఈశాన్యం వైపున ఖాళీగా ఉంచాలన్నది కొత్త పీసీసీ నేతల ఆలోచన అని అంటున్నారు.
ఆవరణలో గాంధీ విగ్రహం మినహా మరే నిర్మాణాలు ఉండరాదని నేతలు భావిస్తున్నారట.
రేవంత్ పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించే కార్యక్రమంలో పాత గేటు నుండి వచ్చి కొత్త గేటు ద్వారా బయటకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.
జూలై 7న అధ్యక్ష బాధ్యతలు అందుకోబోతున్నారు ఈలోగానే ఈ మార్పులు పూర్తి చేయాలని చూస్తున్నారు.కొందరు వాస్తు నిపుణుల గాంధీ భవన్ ను పరిశీలించి వారి సూచనలు చెప్పారట.
వాస్తు సిద్ధాంతుల సూచనల మేరకే గాంధీ భవన్ లో మార్పు చేయిస్తున్నట్టు సమాచారం.కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి శకం మొదలవుతుంది.కొత్త పీసీసీ అధ్యక్షతన అయినా కాంగ్రెస్ బలంగా మారుతుందో లేదో చూడాలి.