గంభీర్ లేక‌పోతే పానీపూరీలు అమ్ముకునేవాడినంటున్న క్రికెట‌ర్‌

మాటకు తలొంచి తన జీవితాన్ని మార్చుకున్నానని చెప్పాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్.ఐపీఎల్ రెండో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో షెల్డన్ తన జీవితం గురించి, ఎలా క్రికెటర్‌గా లైఫ్ స్టార్ట్ అయిందనే విషయాలు తెలిపాడు.

 Gambhir Or Cricketer Who Seems To Be Selling Panipuris-TeluguStop.com

దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న షెల్డన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఒకానొక టైంలో తాను క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నానని, అలా చేసి ఉంటే తాను రోడ్డు మీద పానీ పూరి బండి పెట్టుకుని ఉండేవాడినని షెల్డన్ జాక్సన్ చెప్పుకొచ్చాడు.

తను ఇచ్చిన మాటకు తలొంచి దేశంలో ఉన్ని రికార్డులన్నిటినీ బ్రేక్ చేశానని, అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచానని చెప్పాడు.దేశవాళీ లీగ్‌లు అన్నీ ఆడి, ఒక్క ఏడాదిలోనే నాలుగు సెంచరీలు చేశానని, మూడు వరుస సెంచరీస్‌తో తన కెరీర్ బూస్ట్ అయిందని షెల్డన్ జాక్సన్ వివరించాడు.

 Gambhir Or Cricketer Who Seems To Be Selling Panipuris-గంభీర్ లేక‌పోతే పానీపూరీలు అమ్ముకునేవాడినంటున్న క్రికెట‌ర్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే గౌతం గంభీర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు షెల్డన్.ఢిల్లీతో రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో తాను హాఫ్ సెంచరీతో మెరిశానని, ఆ సందర్భంగా గౌతం గంభీర్ దగ్గరకు వెళ్లి తన గురించి అడిగినపుడు, తాను బాగా బ్యాటింగ్ చేసినట్లు ప్రశంసించాడని గుర్తు చేసుకున్నాడు షెల్డన్ జాక్సన్.

అయితే, ఐపీఎల్‌ వేలంలో తొలి రౌండ్‌లో తనను ఎవరూ కొనలేదని బాధపడ్డానన్నాడు.ఇకపోతే గౌతం తన గురించి చెప్పడం వల్లే కేకేఆర్ మేనేజ్‌మెంట్ తనకు కాల్ చేసిందని షెల్డన్ తెలిపాడు.

తనకు అండగా నిలబడిన గౌతం గంభీర్ పట్ల తనకెప్పుడూ ఆరాధన భావమే ఉంటుందని తన కృతజ్ఞతను చాటుకున్నాడు షెల్డన్ జాక్సన్.ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఐదు వేల పరుగులు చేశాడు షెల్డన్‌.

ఇటీవలి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 50 బంతుల్లో 106 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు.టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా షెల్డన్ జాక్సన్ ఉన్నాడు.

#Jakson #Gambhir

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు