చిరంజీవి పాత సినిమా టైటిల్ తో రాబోతున్న మహేష్ మేనల్లుడు

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలే కనిపిస్తాయి.ఆడియన్స్ కి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ తన సినిమాలో ఉండే విధంగా చూసుకోవడం వలెనే చిరు మెగాస్టార్ గా టాలీవుడ్ లో అగ్రస్థానంలో నిలబడ్డాడు అని చెప్పాలి.

 Galla Ashok Use Chiranjeevi Old Movie Title-TeluguStop.com

కెరియర్ లో అప్పుడప్పుడు ప్రయోగాత్మక కథలు చేసి విఫలం అయిన అవి తన టేస్ట్ కి తగ్గట్లు చేసినవే.అయితే ఖైది సినిమా తర్వాత ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చిన చిరంజీవి తరువాత అదే జోనర్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చారు.

అవన్నీ చాలా వరకు వర్క్ అవుట్ అయ్యాయి.ఇక ఆయన సినిమా టైటిల్స్ కూడా కమర్షియల్ ఎలివేషన్ ఉండే విధంగానే దర్శకులు పెట్టేవారు.

 Galla Ashok Use Chiranjeevi Old Movie Title-చిరంజీవి పాత సినిమా టైటిల్ తో రాబోతున్న మహేష్ మేనల్లుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కారణంగా అవి వేగంగా జనంలోకి రీచ్ అయ్యి సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేసేవి.అయితే ఇప్పుడు స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా మెగాస్టార్ హిట్ సినిమా టైటిల్స్ ని రిపీట్ చేస్తూ తమ సినిమాల కోసం పెట్టుకుంటున్నారు.

తమిళ్ హీరో కార్తి ఖైది టైటిల్ తో వచ్చి హిట్ కొట్టాడు.అలాగే దొంగ టైటిల్ కూడా వాడుకున్నాడు.అలాగే తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ ని వాడుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు విజేత అనే టైటిల్ ఉపయోగించుకున్నాడు.

కమెడియన్ శ్రీనివాసరెడ్డి మొగ్గురు మొనగాళ్ళు టైటిల్ తో సినిమా చేస్తున్నాడు.ఇదిలా ఉంటే మరో తెరంగేట్రం హీరో చిరంజీవి హిట్ మూవీ టైటిల్ ని ఉపయోగించుకుంటున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అనే ఇమేజ్ తో వస్తున్న నటుడు గల్లా అశోక్.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ హీరోగా ఒక సినిమా తెరకెక్కింది.

దీనికి సంబందించిన పోస్టర్, టైటిల్ టీజర్ మహేష్ చేతుల మీదుగానే రిలీజ్ చేయబోతున్నారు.అయితే ఈ మూవీకి హీరో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

దీనినే మహేష్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

#GallaAshok #ChiranjeeviOld #Galla Ashok #Sriram Aditya #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు