చివరి నిమిషంలో 'హీరో' కోసం సూపర్‌ స్టార్స్‌

Galla Ashok Hero Movie Releasing Today

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా రూపొందిన ‘హీరో‘ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా ప్రారంభం అయ్యే సమయంకు రమేష్‌ బాబు మృతి చెందడం.

 Galla Ashok Hero Movie Releasing Today-TeluguStop.com

మహేష్ బాబు కరోనా బారిన పడటం జరిగింది.దాంతో హీరో సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లే పెద్ద తలకాయ లేకుండా పోయింది.

మహేష్ బాబు మరియు కృష్ణ లు మీడియా ముందుకు వచ్చి హీరో సినిమా గురించి మాట్లాడుతారు అనుకుంటే ఇలా అయ్యిందనే ఆవేదన అభిమానుల్లో వ్యక్తం అయ్యింది.ఎట్టకేలకు సినిమా విడుదల సందర్బంగా మహేష్ బాబు మరియు కృష్ణ లు వీడియో బైట్‌ ఇచ్చారు.

సినిమా గురించి మరియు అశోక్‌ గురించి మాట్లాడారు.

Telugu Ashok Galla, Krishna, Mahesh Babu-Movie

ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను వారు వ్యక్తం చేశారు.నేడు విడుదల అవుతుంది అనగా మహేష్ బాబు మరియు కృష్ణ ల వీడియో బైట్స్ సినిమా కు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను నేడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో వారసులు ఎక్కువ అయ్యారు.మరి ఆ వారసుల్లో ఎక్కువ మంది హిట్ లేక ఢీలా పడి పోయారు.మరి కొందరు మాత్రం మంచి సక్సెస్ తో దూసుకు పోతున్నారు.కనుక ఎవరి సరసన ఈ హీరో చేరుతాడు అనేది చర్చనీయాంశంగా మారింది.

మొదటి సినిమా తోనే కమర్షియల్‌ గా సక్సెస్ దక్కించుకుంటే కెరీర్‌ లో ముందుకు వెళ్లడం ఖచ్చితంగా సాధ్యం అవుతుంది.కాని హీరో సినిమా కు ఆయన కు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది చూడాలి.

మరి కాసేపట్లో సినిమా కు సంబంధించిన క్లారిటీ ఇవ్వబోతున్నారు.

#Krishna #Mahesh Babu #Ashok Galla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube