మహేష్‌ బాబు మేనల్లుడు బాగానే రాబట్టాడే!

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు.మహేష్‌ బాబు మేనల్లుడు అయిన అశోక్‌ గల్లా హీరోగా సినిమా మొదలు అయ్యి చాలా కాలం అయ్యింది.

 Galla Ashok First Movie Hero Teaser Report-TeluguStop.com

శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వంలో గల్లా వారే ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.కృష్ణ సమర్పిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా చాలా ఆలస్యం అయ్యి ఎట్టకేలకు విడుదలకు సిద్దం అవుతుంది.

తాజాగా ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.సహజంగా కొత్త హీరో.

 Galla Ashok First Movie Hero Teaser Report-మహేష్‌ బాబు మేనల్లుడు బాగానే రాబట్టాడే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి సినిమా అంటే పెద్దగా జనాలు పట్టించుకోరు.కాని సూపర్‌ స్టార్‌ వారి ఫ్యామిలీ.

అదీ కాకుండా కృష్ణ కు స్వయాన మనవడు.సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు మేనల్లుడు అవ్వడం వల్ల అశోక్‌ గల్లా మూవీ ఎలా ఉంటుందా అంటూ కొందరు ఆసక్తి చూపించారు.‘హీరో’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిన కారణంగా టీజర్ ను విడుదల చేయడం జరిగింది.

మహా మహులు ఈ టీజర్ ను షేర్‌ చేయడం వల్ల సహజంగానే అందరి దృష్టిని ఈ టీజర్ ఆకర్షించింది.

ఎంత ఆకర్షించినా కూడా మిలియన్ వ్యూస్ అంటే చాలా గొప్ప విషయం.కాని ఈ టీజర్ ఏకంగా నాలుగు మిలియన్ ల వ్యూస్ ను క్రాస్ చేసి ఇప్పటికి యూట్యూబ్‌ ఇండియా ట్రెండ్‌ నెం.2 లో ఉంది.భారీ గా వస్తున్న వ్యూస్ ను బట్టి ప్రేక్షకులు టీజర్ నచ్చిందని.

అశోక్ కూడా కనెక్ట్‌ అవుతాడని అనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో అందాల నిధి అన్నట్లుగా ఉండే నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఇప్పటికే వచ్చిన పాట మరియు టీజర్ లు ఆకట్టుకోవడం వల్ల ఖచ్చితంగా సినిమా కూడా మరో రేంజ్ లో ఉంటుందని సూపర్ స్టార్ ఫ్యామిలీ అభిమానులు అంటున్నారు.గల్లా అశోక్ కు హీరో మొదటి సక్సెస్ ను ఇస్తుందా అనేది చూడాలి.

#@ravipatic #Galla Ashok #@IamJagguBhai #Mahesh Babu #SuperStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు