లవర్ బాయ్ లా కనిపిస్తున్న మహేష్ బాబు మేనల్లుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ వారసుడు అశోక్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Galla Ashok First Look In Debut Movie With Sri Ram Adithya, Tollywood, Super Sta-TeluguStop.com

గతంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో గల్లా అశోక్ హీరోగా సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది.ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సొంత ఫ్యామిలీ ప్రొడక్షన్ ద్వారానే హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది.

సూపర్‌స్టార్‌ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో.

అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అశోక్‌ పుట్టిన సందర్భంగా ఆదివారం ఈ చిత్రం హీరో ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

టేబుల్‌పై కూర్చొని ల్యాంప్ వెలుగులో పుస్త‌కం చ‌దువుతున్న అశోక్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది.ఇక ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న మరో లవర్ బాయ్ లా గల్లా అశోక్ లుక్ ఉంది.

ఇక ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.డిఫరెంట్ కంటెంట్ లతో సినిమాల్యు తీసే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ ఎంట్రీ అంటే ఎలాంటి కథతో వస్తున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube