జ‌నసేన‌లోకి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తోంది, అసంతృప్తితో ర‌గిలిపోతున్న నేత‌లు.పార్టీ మార‌బోమ‌ని చెబుతున్నా.

 Gali Muddu Krishnama Naidu To Join Jana Sena-TeluguStop.com

క్యాడ‌ర్ మాత్రం ఇత‌ర పార్టీల వైపు మొగ్గు చూపుతోంది.ముఖ్యంగా భ‌విష్య‌త్తులో నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మారే అవ‌కాశ‌మున్న జ‌న‌సేన వైపు చాలా మంది చూస్తున్నార‌ని తెలుస్తోంది.

ఆ పార్టీలో జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌ప్ప సీనియ‌ర్ నాయ‌కులెవ‌ర‌కూ క‌నిపించ‌డం లేదు.దీంతో ఆ పార్టీలో చేరితే త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్కుతుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నారట‌.

ప్ర‌స్తుతం టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కూడా జ‌న‌సేనలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.ఈ మేర‌కు ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం.

మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన వారిలో టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కూడా ఒక‌రు.టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్ర‌మించిన ఆయ‌న‌కు ఈసారి తీవ్ర నిరాశే ఎదురైంది.

దీంతో ఇక ఆయ‌న పార్టీ మార‌తార‌నే ఊహాగానాలు బ‌లంగా వినిపిస్తున్నాయి.అంతేగాక ఆయ‌నో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.

దీనిపై చ‌ర్చించ‌గా.ప‌వ‌న్ నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేంటంటే.జ‌స‌న‌సేన‌లో ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ట‌.

2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించినా.ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టిసారించ‌లేదు.

ఆ స‌మ‌యానికి పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలంటే.బ‌ల‌మైన నాయ‌కులు కూడా అవ‌స‌రం.

క‌నుక పార్టీకి సీనియ‌ర్ల అవ‌స‌రం చాలా ఉంది.దీంతో గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడి వంటి వారు చేరితే జ‌న‌సేన‌కు బ‌లం చేకూరుతుంద‌ని విశ్వ‌సిస్తున్నారు.

వారి అనుభవం పార్టీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని న‌మ్ముతున్నారు ప‌వ‌న్‌.అందుకే ఆయ‌న‌తో సానుకూలంగా మాట్లాడార‌ని తెలుస్తోంది.

అన్నీ అనుకూలిస్తే జ‌న‌సేన‌కు సిద్ధాంత‌క‌ర్త‌గా ఆయ‌న నియ‌మితుల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు.

టీడీపీ స్థాపించిన‌పుడు ఎన్టీఆర్ వెనుకే ఉన్నారు.

తద‌నంత‌ర ప‌రిణామాల‌తో ఆయ‌న చంద్ర‌బాబు కోట‌రీలోకి మారిపోయారు.అప్ప‌టి నుంచి పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హరిస్తున్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ ఆయ‌న పార్టీ వెన్నంటే ఉన్నారు.ఆ న‌మ్మకంతోనే మంత్రి ప‌ద‌విపై ఆశ‌లుపెట్టుకున్నారు.

అయితే చివ‌ర‌కు వైసీపీ నుంచి పార్టీలో చేరిన అమ‌ర్నాథ్‌రెడ్డికి ఆ అవ‌కాశం ద‌క్కింది, దీంతో ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు సీనియ‌ర్ నేత‌లు రంగంలోకి దిగినా.ఫ‌లితం లేక‌పోయింద‌ట‌.

ఇక పార్టీకి రాజీనామా చేయాల‌ని బ‌లంగా డిసైడ్ అయ్యార‌ట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube