'గాలి' ఆటలు ఇలా సాగాయా ..? ఇప్పుడు ఎక్కడున్నాడో...?   Gali Janardhan Reddy Missing Now Out Of States     2018-11-08   12:21:25  IST  Sai M

గాలి జనార్ధనరెడ్డి … ఈ పేరు దేశవ్యాప్తంగా ఒకప్పుడు మారుమోగింది… ఇప్పటకీ మారుమోగుతోంది. ఆయన దర్పం … కాన్ఫిడెన్స్ … రాజకీయం అన్నిటిలోనూ ఆయన చాలా డిఫ్రెంట్ అనేది అందరికి తెలుసు. ఆయన మైనింగ్ సామ్రాజ్యం లో మకుటంలేని మహరాజులా ఒక వెలుగు వెలిగి ఆ తరువాత అదే కేసుల్లో జైలుపాలయ్యాడు. అసలు గాలి తత్వం చూస్తే… దేన్నైనా డబ్బుతో కొనుక్కోవచ్చు అనుకుంటారు. గతంలో గనుల కేసులో.. సీబీఐ కోర్టులో బెయిల్ కోసం.. న్యాయమూర్తికి లంచం ఇచ్చి.. అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే డబ్బులు ఎర చూపినట్లు కర్ణాటక ఎన్నికల సమయంలో కొన్ని వీడియోలు బయటకి వచ్చాయి.

తాజాగా గాలి జనార్దన్ రెడ్డి పరారీలో ఉన్నాడు… దీనికి కారణం ఈడీ అధికారులతో ఓ కేసు మాఫీ చేయించేందుకు తనే స్వయంగా బేరం కుదుర్చుకున్న ఘటన బయటకు వచ్చింది. అసలు గాలి జనార్దన్ రెడ్డి.. తన అక్రమ మైనింగ్ ను.. అలా నిరాటంకంగా కొనసాగించగలగడానికి కారణం.. ఈ తరహాలో మనషుల్ని కొనేయడమేనని.. చాలా మందికి తెలుసు. అయితే ఇదే అస్త్రాన్ని ఏకంగా న్యాయమూర్తుల మీదే ప్రయోగిస్తారని మాత్రం ఊహించలేకపోయారు. అధికారులు, రాజకీయ నేతలకు ఇలా డబ్బులు ఆశ పెట్టరాంటే అర్థం ఉంది కానీ.. న్యాయమూర్తులు, ఈడీ, సీబీఐ లాంటి అధికారులకు కూడా లంచాల ఎర వేయడం గురించి బయటకి తెలియడంతో ‘గాలి’ దుమారం రేగుతోంది.

Gali Janardhan Reddy Missing Now Out Of States-

అసలు ఈడీకి.. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధం ఏమిటి..?ఆయన కోసం ఈడీ అధికారులు ఎందుకు వెతుకుతున్నారు అనేది చూస్తే… పోంజి స్కీములు నడిపి.. వందల కోట్లు కొల్లగొట్టిన సంస్థ ఈడీ కేసుల్ని తప్పించుకోవడానికి గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ప్రయత్నించడం.. ఏమిటన్న సందేహం చాలా మందికి కలుగుతోంది. బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన కేసు విషయంలో ఈడీ అధికారికి గాలి జనార్దన్ రెడ్డి రూ. కోటి లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆయణ్ని అదుపులోకి తీసుకొని విచారించడానికి పోలీసులు యత్నిస్తున్నారు. అంతే కాదు గాలి అనుచరుడు అలీఖాన్‌ కోసం కూడా కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నట్లు. ఫోన్ ట్రేసింగ్ ద్వారా తెలుసుకున్న కర్ణాటక పోలీసులు హైదరాబాద్‌లో గాలింపు చేస్తున్నారు.