రిషీ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌ ఎవరు?

వీరిద్దరూ ఎవరో తెలియనివారు చాలా తక్కువ.సినిమాలతో అంతో ఇంతో సంబంధం ఉన్నవారికి వీరు తెలియకుండా ఉండరు.

 ‘who Are Anupam Kher And Rishi Kapoor?’-TeluguStop.com

అయితే వీరెవరో తనకు తెలియదని అన్న వ్యక్తి సామాన్యుడు కాదు.ప్రతిష్టాత్మకమైన ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ఛైర్మన్‌ గజేంద్ర చౌహాన్.

ఈ ఇన్‌స్టిట్యూట్‌కు చౌహాన్‌ నియామకం ప్రస్తుతం దేశంలో దుమారం రేపుతోంది.ఈయన నియామకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒక న్యూస్‌ ఛానెల్‌ ఆయనతో మాట్లాడినప్పుడు ‘రిషీ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌ ఎవరు?’ అని ఆయన ప్రశ్నించారు.దీనిపై రిషీ కపూర్‌ ఘాటుగానే స్పందించారు.‘చౌహాన్‌ స్వచ్ఛందంగా రిటైర్‌ అయితే విద్యార్థులకు మలేఉ జరుగుతుంది’ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.అనుపమ్‌ ఖేర్‌ కూడా తీవ్రంగానే స్పందించారు.

ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా నియమితుడైన వ్యక్తికి ప్రపంచ సినిమాపై అవగాహన ఉండాలన్నారు.గజేంద్ర చౌహాన్‌ కంటే ఎక్కువ అర్హతలు ఉన్న వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించడం మంచిదన్నారు.

ప్రభుత్వం పేరు పొందిన సినీ దిగ్గజాలను పక్కకు పెట్టి ఈ మాజీ టెలిఇవిజన్‌ నటుడిని చైర్మన్‌గా నియమించింది.ఈ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌ పదవి కోసం అనుపమ్‌ ఖేర్‌తోపాటు అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, శ్యాం బెనగల్‌ మొదలైనవారి పేర్లు పరిశీలనకు వచ్చాయి.

అయితే వారినందరినీ కాదని చౌహాన్‌ను నియమించారు.ఒకప్పుడు పాపులర్‌ టీవీ సీరియల్‌ ‘మహాభారత్‌’లో చౌహాన్‌ ధర్మరాజు పాత్ర పోషించాడు.

ఈయన కొన్ని ‘అడల్‌్ట’ (పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమాలు) సినిమాల్లో నటించినట్లు కొందరు చెబుతున్నారు.ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు ఈయన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

క్లాసులు కూడా బహిష్కరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube