సామాన్య ప్రజలను పరిగెత్తించి కొట్టిన కలెక్టర్.. కారణం ఏంటో తెలుసా..

కరోనా కేసులు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారు.మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి అని ప్రతిరోజు చెబుతున్నప్పటికీ చాలామంది నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు.

 Gajapati District Collector Anupam Saha Serious Action About Covid Rules , Colle-TeluguStop.com

వీరి నిర్లక్ష్యం ఇతరుల ప్రాణాలకు హానికరం గా మారుతోంది.పోలీసులు సాధ్యమైనంతవరకు ప్రజలను కరోనా రూల్స్ పాటించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కానీ ఒక ప్రాంతంలో మాత్రం ఏకంగా ఒక కలెక్టరు రంగంలోకి దిగి కరోనా రూల్స్ పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న సామాన్య ప్రజలను పరిగెత్తించి పరిగెత్తించి కర్రలతో కొట్టారు.దీంతో ఆ కలెక్టర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఒకవైపు ఆక్సిజన్ బెడ్లు దొరక్క చాలామంది కరోనా రోగులు బయటే ప్రాణాలు విడుస్తుంటే.కొందరు మాత్రం ఏమవుతుందిలే నిర్లక్ష్యంతో కరోనా తెచ్చుకొని మిగతా వారికి కూడా అంటిస్తున్నారు.

సులువైన నిబంధనలైనా సరే తాము పాటించం.మీరేం చేస్తారు.

అనే ధోరణిని ప్రస్తుతం చాలామంది ప్రజల్లో కనిపిస్తోంది.బహుశా అందుకేనేమో కలెక్టర్ అనుపమ కుమార్ సాహా కి పట్టరాని కోపం వచ్చింది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కేంద్రం పర్లాకిమిడిలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగి పోతుండటంతో.స్థానిక మహేంద్రతనయ వంతెన వద్ద ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ని మూసేశారు.దీనితో విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సరిహద్దు దాటకుండా పాతపట్నం డిపో వద్ద ఆగిపోతున్నాయి.

దీంతో ఒడిశాకు రావాలనుకునేవారు ప్రయాణికులు అక్కడినుంచి కాలినడకన బయలుదేరుతున్నారు.ఐతే ఈ ప్రయాణికులు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ఒడిశా అధికారులకు తమ కాగితాలను చూపించి పర్లాకిమిడి పట్టణానికి రావాల్సి ఉంటుంది.

ఐతే పాతపట్నం డిపో నుంచి పర్లాకిమిడి పట్టణానికి వచ్చే చాలామంది ప్రయాణికులు కరోనా నిబంధనలు పాటించడం లేదు.ఐతే తమ జిల్లాలో ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుంది భావించిన కలెక్టర్‌ అనుపమ కుమార్‌ సాహా.

సబ్‌కలెక్టర్‌ సంగ్రాం కేసరి పండాలు లతో కలిసి శనివారం రోజు చేత కర్రలు పట్టుకొని కొవిడ్ నిబంధనలు పాటించని వారందరినీ పరిగెత్తించి పరుగెత్తించి కొట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube