మదురో పై జరిగిన కుట్ర లో గైడో ప్రమేయం,ఇద్దరు సెక్యూరిటీ గార్డుల అరెస్ట్

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కు వ్యతిరేకముగా ఆ మధ్య కుట్ర జరిగిన సంగతి తెలిసిందే.ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు కూడా దారి తీసింది.

అయితే ఈ ఘటనలో స్వయం ప్రకటిత తాత్కాలిక అధ్యక్షుడు జువాన్ గైడో కు ప్రమేయం ఉందంటూ ఆ దేశ సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్ వెల్లడించారు.

-Telugu NRI

ఏప్రిల్‌30న జరిగిన విఫల సైనిక కుట్రలో వినియోగించిన ఆయుధాలను అదే రోజు గైడో సెక్యూరిటీ గార్డ్‌లు కొందరు తస్కరించినట్టు తమకు సమాచారం లభించింది అని అయితే తాజాగా ఇద్దరుసెక్యూరిటీ గార్డులు ఈ ఆయుధాలను 35 వేల అమెరికన్‌ డాలర్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రోడ్రిగ్జ్‌ మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏప్రిల్ లో అధ్యక్షుడు నికొలస్‌ మదురోకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గైడో ప్రమేయం ఉందని, ఆ కుట్రకు వినియోగించిన సైనిక ఆయుధాల చోరీలో గైడో ప్రమేయంపై తమ వద్ద అనేక ఆధారాలున్నాయని ఆయన తెలిపారు.

-Telugu NRI

అయితే తాజాగా ఆయనకు సంబందించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆ ఆయుధాలను విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోవడం తో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వారి నుండి ఐదు ఏకే-103 రైఫిల్స్‌ను, వాటిలో అమర్చే ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.గత ఏప్రిల్ లో అధ్యక్షుడు మదురో పై డ్రోన్స్ తో దాడి జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ, ఆయన ఆ ప్రమాదం నుంచి అదృష్ట వశాత్తు బయటపడగలిగారు.

అయితే తన పై దాడి కి అమెరికా నే కుట్ర పన్నినట్లు మదురో ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube