వారం ఆలస్యంగా పుట్టింది... పుట్టక ముందే తల్లిని సర్పంచ్‌గా చేసిన చిన్నారి తల్లి  

Gadwal Dist Women Gave Birth To Third Chaild After Becoming Sarpanch-

తెలంగాణ వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి అయ్యాయి.

Gadwal Dist Women Gave Birth To Third Chaild After Becoming Sarpanch- Telugu Viral News Gadwal Dist Women Gave Birth To Third Chaild After Becoming Sarpanch--Gadwal Dist Women Gave Birth To Third Chaild After Becoming Sarpanch-

మూడవ దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.రేపు మూడవ దశ ఎన్నికలు జరుగబోతున్నాయి.

ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటీ అంటే పంచాయితీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారు పోటీకి అనర్హం.ఈ నిబందన ఎన్నో సంవత్సరాలుగా వస్తూనే ఉంది.ఈమద్య కాలంలో ముగ్గురు పిల్లలకు తండ్రి లేదా తల్లి అయితే మాత్రం కనీసం ఎన్నికల్లో పోటీకి కూడా అర్హం కాదు.కాని గద్వాల జిల్లాలో మాత్రం ఒక మహిళ ముగ్గురు పిల్లలకు తల్లి అయినా కూడా సర్పంచ్‌ అయ్యింది.

Gadwal Dist Women Gave Birth To Third Chaild After Becoming Sarpanch- Telugu Viral News Gadwal Dist Women Gave Birth To Third Chaild After Becoming Sarpanch--Gadwal Dist Women Gave Birth To Third Chaild After Becoming Sarpanch-

అదృష్టం కొద్ది మహాదేవి అనే మహిళ సర్పంచ్‌ అయిన తర్వాత మూడవ బిడ్డకు తల్లి అయ్యింది.నెలలు నిండిన ఆ మహిళ సర్పంచ్‌గా పోటీ చేసింది.

అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న ఆ మహిళ మళ్లీ గర్బవతి అవ్వడంతో ఆమె పోటీని అర్హురాలు కాదు అంటూ ప్రత్యర్థులు అన్నారు.కాని అధికారులు మాత్రం ఆమె ఇంకా డెలవరీ అవ్వలేదు కనుక, ఆమెకు అధికారికంగా ఇద్దరు పిల్లలే అంటూ అధికారులు తేల్చి చెప్పి ఆమె నామినేషన్‌ను స్వీకరించారు.

ఆమె పడ్డ కష్టంకు గ్రామ ప్రజలు అయ్యో పాపం అనుకున్నారో లేక మరేంటో కాని ఆమె సునాయాసంగా గెలిచేసింది.

సర్పంచ్‌గా ఎన్నికైన మూడు రోజుల్లోనే ఆమె తల్లి అయ్యింది.

పండంటి పాపాయికి జన్మనిచ్చింది.అద్బుతమైన ఈ సంఘటన గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి మండలంలో గువ్వలదిన్నె అనే గ్రామంలో జరిగింది.

ఆ పాపాయి మూడు రోజుల ముందు పుట్టి ఉంటే తల్లిని సర్పంచ్‌ కాకుండా అడ్డుకునేది.పాపాయి మూడు రోజుల తర్వాత పుట్టడం వల్ల తల్లిని సర్పంచ్‌ చేసి మరీ పుట్టిందని పుట్టిన పాపాయిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పుట్టిన పాపాయితోనే మహాదేవి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేయబోతుంది.సర్పంచ్‌ అయిన తర్వాత తల్లి అయ్యింది కనుక ఏం చేయలేమని అధికారులు అంటున్నారు.

.

తాజా వార్తలు