ఏరా... కేసీఆర్ పైనే పోటీ చేస్తావా ..?  

Gadvel Congress Candidate Onteru Venugopal Fire On Kcr-

గత కొద్ది రోజులుగా… తెలంగాణలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతోంది.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా… ఆయన మీద అనేక వేధింపులు జరుగుతున్నాయి అంటూ… ఆయన ఆత్మహత్యాయత్నం చేసేందుకు కూడా ప్రయత్నిచాడు.ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కెసిఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు.

Gadvel Congress Candidate Onteru Venugopal Fire On Kcr- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Gadvel Congress Candidate Onteru Venugopal Fire On Kcr--Gadvel Congress Candidate Onteru Venugopal Fire On Kcr-

‘‘నిన్న నా ప్రచారం ముగించుకుని ఓ పెళ్లికి హాజరవుతుంటే నాలుగు జీపుల్లో పోలీసులు వచ్చి నన్ను అడ్డుకున్నారు.వారికి యూనిఫాం కూడా సరిగా లేదు.

నేమ్‌ ప్లేట్‌లు లేవు.నేరుగా ఇంట్లోకి వచ్చి వస్తువులు చిందరవందరగా పడేసి, బీరువాలు సోదా చేశారు.

‘ఏరా కేసీఆర్‌పై పోటీ చేస్తావురా! అంత ధైర్యముందారా నీకు.అమరావతికి వెళ్లి డబ్బులు తెస్తున్నావా?’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు.

కేసీఆర్‌కు జ్ఞానం ఉండాలి.అమరావతికి వెళ్లి నేనెందుకు డబ్బులు తెస్తాను.

నా ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారుగా! నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసే ఉంటుంది.నేను అమరావతికి వెళ్లి డబ్బులు తెస్తే, కేసీఆర్‌, హరీశ్‌రావులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.

’’ అంటూ ఆయన ఆవేశంగా… మాట్లాడారు.

తాజా వార్తలు