కొత్త వాహన చట్టం పై గడ్కరీ కామెంట్స్  

Gadkari Comments On New Traffic Rules-indian Trafic Ploice,road Accidents,trafic Fine Ten Thousands

సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.దీనితో ప్రజలు తమ తమ వాహనాలతో బయటకు రావాలి అంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Gadkari Comments On New Traffic Rules-Indian Trafic Ploice Road Accidents Fine Ten Thousands

ఇప్పటికే బైక్ నడిపే వారు చెప్పులు వేసుకుంటే,ఫైన్ అలానే జైలు శిక్ష ఉంటుంది అంటూ కొత్త రూల్ వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ కొత్త కొత్త రూల్స్ తో సామాన్యులు పిచ్చెక్కిపోతున్నారు.

ఇలాంటి రూల్స్ తో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రచారం కూడా జరిగిపోయింది.అయితే తాజాగా ఈ కొత్త రూల్స్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ… రోడ్డుపై యాక్సిడెంట్ అవుతుంటే,ప్రభుత్వం ఏం చేస్తుందని, దేశంలో చట్టాలు సరిగా అమలు చేయడం లేదని,పోలీస్ వ్యవస్థ తీరు కూడా సరిగా లేదంటూ ప్రజలే మండిపడుతుంటారు.

Gadkari Comments On New Traffic Rules-Indian Trafic Ploice Road Accidents Fine Ten Thousands


  మరి అలాంటిది ఇలాంటి చట్టాలను తీసుకువచ్చి అమలు చేస్తే ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు.చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని.ప్రజల సేఫ్టీ కోసమే వాహన చట్టం తీసుకొచ్చామని అన్నారు.అయితే కేవలం మనదేశంలోనే ఇలాంటి సింపుల్ ఫైన్ సిస్టం అమలు చేస్తున్నారని చెప్పాలి.

ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ ని మాత్రం ఇతర దేశాల్లో అతిక్రమిస్తే అక్కడ మాత్రం ఈ ఫైన్ ల గోల భారీ గానే ఉంటుందని చెప్పాలి.అమెరికా విషయానికి వస్తే.సీటు బెల్ట్ పెట్టుకోకపోతే 25డాలర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 1000డాలర్లు, హెల్మెట్ లేకుంటే 300 డాలర్లు చలానా విధిస్తారు.అదే రష్యా లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కు 50వేల రూబుల్స్ తో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.

ఇక సింగపూర్ లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 5000 డాలర్లు ఫైన్, అలానే వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడితే 1000 డాలర్ల ఫైన్ పడుతుంది.ఇలా చెప్పుకుంటూ పొతే అక్కడ అంతా కూడా భారీ గానే ఫైన్ లను విధిస్తున్నారు.

ఇక మరి దుబాయ్ లో అయితే ఫైన్ లు చాలా వింతగా ఉంటాయనే చెప్పాలి.అక్కడి ప్రభుత్వం శుభ్రతకు ఎక్కువ ప్రాముఖ్యత నిస్తుంది.ఈ క్రమంలో మురికిగా ఉన్న వాహనం కనిపిస్తే మొదట హెచ్చరిస్తారు.

  దాంతో పాటు 500 దిర్హామ్ లు ఫైన్ వేస్తారు.15 రోజుల తరువాత కూడా ఆ వాహనం అంతే మురికిగా కనిపిస్తే దాన్ని డంపింగ్ యార్డ్ కు పంపిస్తారట.ఇలా ఇతర దేశాల తో పోల్చుకుంటే భారత్ లో విధించే చట్టాలు చాలా చిన్నవే అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు

Gadkari Comments On New Traffic Rules-indian Trafic Ploice,road Accidents,trafic Fine Ten Thousands Related....