గద్దలకొండ గణేష్‌ కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటో తెలుసా?  

Gaddla Konda Ganesh Collections Details-

వరుణ్‌ కీలక పాత్రలో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్మీకి అలియాస్‌ గద్దలకొండ గణేష్‌ చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ దక్కింది.సినిమా మాస్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Gaddla Konda Ganesh Collections Details-

అందుకే మొదటి మూడు రోజుల్లో మంచి వసూళ్లు నమోదు అవ్వడంతో పాటు అప్పుడే కొన్ని ఏరియాల్లో లాభాల బాటలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది.మొదటి రోజు దాదాపుగా 6.5 కోట్ల షేర్‌ను దక్కించుకున్న ఈ చిత్రం తర్వాత రెండు రోజుల్లో 10 కోట్ల షేర్‌ను రాబట్టింది.అంటే మొత్తంగా 16 కోట్లకు పైగా షేర్‌ను మొదటి మూడు రోజుల్లోనే రాబట్టింది.

  సినిమా అన్ని ఏరియాల్లో కలిపి పాతిక కోట్ల లోపు బిజినెస్‌ను చేసింది.అంటే లాంగ్‌ రన్‌లో మరో 9 కోట్లను వసూళ్లు చేస్తే లాభాల్లో పడటం ఖాయం.

Gaddla Konda Ganesh Collections Details-

మొదటి వారంలో మరో 5 కోట్ల వరకు రాబట్టడం పక్కాగా సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.అంటే 21 కోట్ల వరకు మొదటి వారంలోనే రాబట్టనుంది.

మిగిలిన నాలుగు కోట్లను ఈజీగానే రాబట్టనుందని అంటున్నారు.మొత్తంగా ఈ చిత్రం 30 కోట్ల వరకు షేర్‌ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే నిజం అయితే బయ్యర్లకు మంచి లాభాలు రావడం ఖాయం.

  మెగా హీరో వరుణ్‌ తేజ్‌ విలన్‌గా కనిపించిన ఈ చిత్రంలో వెల్లువచ్చి గోదారమ్మ పాటకు మంచి రెస్పాన్స్‌ దక్కింది.అద్బుతమైన ఆ పాటను రీమేక్స్‌ చేయడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది.సినిమాకు అది కలిసి వచ్చిన అంశం అయ్యింది.సినిమాలో హీరోగా నటించిన అథర్వ ప్లేస్‌లో మరెవ్వరైనా ఉంటే బాగుండేది.మొత్తంగా గద్దలకొండ గణేష్‌ యావరేజ్‌ హిట్‌ను దక్కించుకున్నట్లే అంటున్నారు.

తాజా వార్తలు

Gaddla Konda Ganesh Collections Details- Related....