కాంగ్రెస్ గూటికి గద్దర్ ..? నేడు ప్రకటన     2018-10-12   11:29:05  IST  Sai M

చాలా కాలంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని తహతహలాడుతున్న ప్రజా గాయకుడు గద్దర్ తన రాజకీయ అడుగులు ఎలా వెయ్యాలో తెలియక తికమక పడ్డాడు. ఏదైనా పార్టీకి మద్దతివ్వాలా లేక నేరుగా కాంగ్రెస్‌లో చేరాలా అన్న దానిపై ఆయన తర్జనభర్జన పడ్డారు. చివరికి ఆయన కాంగ్రెస్ గూటికి చేరాలని ఫిక్స్ అయిపోయారు.

ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీతో కలిసి ఢిల్లీ వెళ్లిన గద్దర్.. కాసేపట్లో రాహుల్‌తో సమావేశం కానున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం లాంఛనం కావడంతో.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్‌పై గద్దర్‌ను పోటీ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.