ఈ చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ని గుర్తు పట్టండి చూద్దాం...

తెలుగులో ఆ మధ్య ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గద్దల కొండ గణేష్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ “మృణాళిణి రవి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే వచ్చీరావడంతోనే మృణాళిణి రవి  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరో చిత్రంలో లో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో పూజాహెగ్డే నటించడంతో ఈ అమ్మడి కి పెద్దగా గుర్తింపు లభించలేదు.

 Gaddalakonda Ganesh Movie Mrinalini Ravi Shared Her Childhood Memory, Mrinalini-TeluguStop.com

దీంతో ఆశించిన స్థాయిలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అవకాశాలను అందుకోలేకపోయింది.కాగా ఇటీవలే మృణాళిని రవి టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకునేందుకుగాను సినిమా పరిశ్రమపై మంచి అవగాహన ఉన్న మేనేజర్ ని కూడా నియమించుకుంది.

అయితే తాజాగా మృణాళిణి రవి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఆ ఫోటోలు ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు మృణాళిణి రవి చిన్నప్పుడు పరక తీసుకొని ఇంటిని శుభ్రం చేస్తున్నట్లుగా నటిస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

దీంతో తాజాగా మృణాళిణి రవి   ఈ ఫోటోని షేర్ చేయడంతో పాటు ఇంటి వద్ద లాక్ డౌన్ సమయంలో మీరేం చేస్తున్నారు.? అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో కొందరు మృణాళిణి రవి అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ చిన్నప్పుడు మృణాళిణి రవి చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Telugu @mirnaliniravi, Childhood, Mrinalini Ravi, Telugu Actress-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా గద్దల కొండ గణేష్ చిత్రంలో నటించిన తర్వాత ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు లేక పోయినప్పటికీ తమిళంలో మాత్రం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.కాగా ప్రస్తుతం తమిళంలో ప్రముఖ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న “కోబ్రా” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే “ఎనిమీ” అనే మరో చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube