తమిళ హీరో చిత్రాన్ని పట్టుకొస్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్  

Ga2uv Pictures To Present Dhanush 40th Film - Telugu Dhanush, Ga2, Ga2uv Pictures, Telugu Movie News, Uv

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.తమిళంతో పాటు ఆయన సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నాడు.

Ga2uv Pictures To Present Dhanush 40th Film - Telugu Dhanush, Ga2, Ga2uv Pictures, Telugu Movie News, Uv-Movie-Telugu Tollywood Photo Image

కాగా ధనష్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌పై రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ధనుష్ హీరోగా తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగులో GA2UV పిక్చర్స్ బ్యానర్‌పై రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శశికాంత్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ధనుష్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా హాలీవుడ్ నటుడు జేమ్స్ కోస్మో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు

Ga2uv Pictures To Present Dhanush 40th Film-ga2,ga2uv Pictures,telugu Movie News,uv Related....