సినీ కార్మికులకి డబ్బులు ఎగ్గొట్టిన ఆర్జీవీ... లీగల్ నోటీస్ జారీ

టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడుగా ముద్ర వేసుకున్న వ్యక్తి ఆర్జీవీ.ఈ మధ్యకాలంలో తన సినిమాల విషయంలో పూర్తిగా దిగజారిపోయి కేవలం పబ్లిసిటీ స్టంట్ లోనే సినిమాలు చేస్తున్న ఆర్జీవీకి దర్శకుడుగా కూడా ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింది.

 Fwice Will Not Work With Ram Gopal Varma Anymore, Tollywood, Telugu Cinema, Boll-TeluguStop.com

నెగిటివ్ పబ్లిసిటీతో తన సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసాని వెనక్కి తెచ్చేసుకుంటున్నాడు.ఎంత చెత్త సినిమా చేసిన ఆర్జీవీకి డబ్బులు మాత్రం వచ్చేస్తాయి.

అసలు నష్టపోవడం ఉండదు.అందుకే కొంత మంది నిర్మాతలు అతనితో ప్రత్యేకంగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగ్ లు అన్ని బంద్ అయిపోయి అందరూ ఖాళీగా ఉంటే ఆ సమయంలో కూడా ఆర్జీవీ ఓ నాలుగు సినిమాల వరకు తీసేశాడు.వీటిని ఒక్కొక్కటిగా ప్రేక్షకుల మీదకి వదులుతున్నాడు.

వివాదాస్పద అంశాలని తీసుకొని వాటి చుట్టూ ఊహాజనిత కథని అల్లుకొని తెరపై ఆవిష్కరించి రిలీజ్ కి ముందు మీడియాలో కొంత హైప్ క్రియేట్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో అతనికి పరిపాటిగా మారింది.అయితే ఆర్జీవీ ఎలాంటి సినిమాలు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

Telugu Bollywood, Cine, Ram Gopal Varma, Telugu, Tollywood-Movie

అతనితోనే క్రియేటివ్ టాలెంట్ ని కూడా జనం మరిచిపోయేలా అత్యంత చెత్త సినిమాలు చేస్తున్నాడు.ఇదిలా ఉంటే కేవలం సినిమాలతో ప్రేక్షకుల సహనంతో ఆదుకోవడమే కాకుండా కార్మికుల పొట్టని కొట్టే పని కూడా ఆర్జీవీ పెట్టుకున్నాడని వినిపిస్తుంది.పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని తెలుస్తుంది. కరోనా వైరస్ సమయంలో అంతా ఇంట్లో ఉంటే వర్మ మాత్రం వారానికో సినిమా తీసాడు.ఆయన తన సినిమాల కోసం చాలా మంది టెక్నీషియన్స్, నటీనటులను కూడా వాడుకున్నాడు.కానీ వాళ్లకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని తెలుస్తుంది.

దాంతో ఇకపై ఆర్జీవీతో పని చేయకూడదని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇదే విషయంపై ఫెడరేషన్ అధ్యక్షుడు బిఎన్ తివారి కూడా స్పందించారు.

పని చేయించుకుని ఇప్పటి వరకు జీతాలే ఇవ్వలేదని, అవన్నీ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటాయని తెలిపారు.వాళ్లకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా వర్మ తప్పించుకొని తిరుగుతున్నాడంటూ ఆరోపణలు చేశారు.

వీలైనంత త్వరగా వాళ్లకు డబ్బులు చెల్లించమని కోరుతూ ఫెడరేషన్ వర్మకు ఇప్పటికే లేఖ రాసిందని, అలాగే లీగల్ నోటీసు కూడా పంపించిందని వాటికి అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు.ఈ నేపధ్యంలో అతని సినిమాలకి పని చేయకూడదని తీర్మానం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube