బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న యూట్యూబ్‌ ‘ఫ్రస్టేటెడ్‌ ఉమెన్‌’

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4కు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.ఆగస్టు 30వ తారీకు నుండి బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం కాబోతున్నట్లుగా స్టార్‌ మా వర్గాల వారు అనధికారికంగా చెబుతున్నారు.

 Frustrated Woman Sunaina,sunaina In Biggboss 4, Bigg Boss Telugu, Renu Desai, Su-TeluguStop.com

మరో వారం రెండు వారాల్లో అందుకు సంబంధించిన ప్రచార వీడియోలను కూడా స్టార్‌ మాలో ప్రసారం చేయబోతున్నారు.నాగార్జునతో ఇప్పటికే యాడ్స్‌ ను చిత్రీకరించారు.

త్వరలోనే కంటెస్టెంట్స్‌ జాబితా కూడా పూర్తి అవుతుంది.ఇప్పటికే దాదాపుగా అందరు ఖరారు అయ్యారు.

చివరి దశలో మరికొన్ని పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.

ఈసారి సీజన్‌లో చాలా విలక్షణమైన కంటెస్టెంట్స్‌ ఉంటారనే టాక్‌ వినిపిస్తుంది.

ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌ పేర్లు ప్రస్థావనకు వచ్చాయి.ఇప్పుడు యూట్యూబ్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ఫ్రస్టేటెడ్‌ ఉమెన్‌ సునయన కూడా సీజన్‌ 4 లో పాల్గొనబోతుంది.

సినిమాల్లో నటించి మెప్పించిన సునయన ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ సందడి చేస్తూ ఉన్నారు.ఈమె చిన్నతనంలోనే అమ్మోరు చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు.

ఇప్పుడు కూడా బుల్లి తెరపై సందడి చేస్తున్నారు.

Telugu Sunayana, Renu Desai-

కొన్ని రోజుల క్రితం జీ తెలుగులో రేణు దేశాయ్‌తో కలిసి యాడ్స్‌లో కనిపించిన ఈమె ఇప్పుడు స్టార్‌ మా బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా కనిపించబోతుంది.ఈమెకు యూత్‌ లో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో తప్పకుండా మంచి ఎంటర్‌టైన్‌ చేస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను ఎంపిక చేశారనే టాక్‌ వినిపిస్తుంది.త్వరలోనే ఆమె ఎంపిక విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube