హైదరాబాద్ లో మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు..!!

తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.పైగా హైకోర్టు తీవ్ర స్థాయిలో కొన్ని విషయాల్లో సీరియస్ అవటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఉంది.

 Further Strict Lock Down Rules In Hyderabad , Telangana High Court, Lock Down, H-TeluguStop.com

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే.మూడు కమిషనరేట్ శివార్లలో కచ్చితంగా ఈ పాస్ చూపించాల్సిందే అన్న రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారు.

రాష్ట్ర సరిహద్దుల్లోనే కాదు మూడు కమిషనరేట్ సరిహద్దుల…పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు అవుతున్న పరిస్థితి.ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషన్ రేట్ లోకి వెళ్లాలంటే  ఈ పాస్ కచ్చితంగా ఉండాలి.

అత్యవసర వాహనాలు మినహా సామాన్యుడు కమిషనరేట్ దాటాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఇటీవల హైదరాబాదులో కూడా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అవుతూ .ఎక్కడికక్కడ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను అనవసరంగా రోడ్ల పైకి రాకుండా ఆంక్షలు విధిస్తుంది.రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమేకాక సిటీ సరిహద్దుల్లో కూడా ఆంక్షలు కఠినతరం చేసింది.

 దీంతో ఒక కమిషన్ రేటు దాటి మరో కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ప్రతి సామాన్యుడి దగ్గర ఈ పాస్ అడుగుతున్నారు పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube