కింగ్ కోబ్రా కొండచిలువ మధ్య భయంకరమైన పోరు.. పిచ్చెక్కిస్తున్న వీడియో..!

విచిత్రమైన జంతువుల వీడియోలను ప్రపంచ నలుమూలలకు చేరవేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది.ఎక్కడ ఏ వింత జరిగినా ముందస్తుగా సోషల్ మీడియాలోనే అది ప్రత్యక్షమవుతుంది.

 Furious Fight Between Python And King Cobra Viral Video Details, King Cobra, Py-TeluguStop.com

అడవిలో జంతువులు, సరీసృపాలు మధ్య జరిగే కొన్ని హాస్యాస్పద సంఘటనలతో పాటు భయం పుట్టించే సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతుంటాయి.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి ఇప్పుడు అందరికీ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.

ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇది ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రెండు పెద్ద పాములు ఒకదానిపై ఒకటి భీకరంగా దాడికి దిగటం చూడొచ్చు.

నీటి కాలువలో పోట్లాటకు దిగిన పాములలో ఒకటి కొండచిలువ అయితే మరొకటి కింగ్ కోబ్రా.ఈ రెండు పాములు కూడా అత్యంత శక్తివంతమైనవి, అలాగే పెద్దవి.అలాంటి ఈ రెండు ఒకదానికొకటి ఎదురై పోరాడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.అయితే మన ఊహకు మించిన విధంగా ఈ జీవులు భీకర పోరుకి దిగడంతో అక్కడ ప్రదేశంలో భీతావహ వాతావరణం ఆవరించింది.

కింగ్ కోబ్రా కొండచిలువ కంటే పరిమాణంలో పెద్దగానే ఉంది.అందుకే కొండచిలువ కింగ్ కోబ్రాని చంప లేకపోయింది.

అయినప్పటికీ అది కింగ్ కోబ్రా ని గట్టిగా చుట్టేసి ముచ్చెమటలు పట్టించింది.ఈ సమయంలో కొండచిలువ ఉడుం పట్టని వదిలించుకోవడానికి కింగ్ కోబ్రా దానిని పలుమార్లు కాటేసింది.

దాదాపు నిమిషాల పాటు వీటి మధ్య భారీ యుద్ధమే నడిచింది.ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన కొండచిలువ కింగ్ కోబ్రా ని వదిలి పారిపోయింది.ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే 60 లక్షలకు వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో పై మీరు ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube