కూతురును పెళ్లికి ఒప్పించేందుకు బన్నీ ప్రయత్నం... స్నేహా రెడ్డి రియాక్షన్‌ ఏంటో తెలుసా?  

అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టా ఇలా అన్నింట్లో కూడా పోస్ట్‌లు పెడుతూ, తన గురించి, తన సినిమాల గురించి, పిల్లల గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఈయన ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో అల్లు అర్జున్‌ తన కుమార్తె అర్హతో నాన్ను నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పించేందుకు ప్రయత్నించాడు. కాని అర్హ మాత్రం తండ్రి చెప్పినట్లుగా అంతా చెప్పి చివరకు మాత్రం చేసుకోను అంటూ చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో ట్రెండ్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Funny Videos Of Allu Arjun And His Daughter About Her Marriage-Funny Mega Family Sneha Reddy Viral Viral In Social Media

Funny Videos Of Allu Arjun And His Daughter About Her Marriage

ఈ వీడియోపై అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి కాస్త విభిన్నంగా మరింత ఫన్నీగా స్పందించింది. అర్హను నేను చూసిన సంబంధం చేసుకుంటావా అని అడుగుతున్న అల్లు అర్జున్‌ను ప్రశ్నిస్తూ… నువ్వు చేసుకున్నావా మీ నాన్న చెప్పిన అమ్మాయిని అంది. స్నేహారెడ్డిని ప్రేమించి మరీ అల్లు అర్జున్‌ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. రెండు ఫ్యామిలీలు కూడా ఒప్పుకుని, అంగీకారంతో వీరిద్దరి పెళ్లి చేశారు. పెళ్లి విషయంలో అల్లు అర్జున్‌ చాలా అడ్వాన్డ్‌ అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇతర హీరోలకు ఆదర్శంగా నిలిచాడు.

Funny Videos Of Allu Arjun And His Daughter About Her Marriage-Funny Mega Family Sneha Reddy Viral Viral In Social Media

ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్‌ తన కూతురుకు మాత్రం తాను చూసిన అబ్బాయినే పెళ్లి చేయాలని భావిస్తున్నట్లుగా ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది. ఇది ఫన్‌ కోసం చేసినా కూడా అల్లు అర్జున్‌ పై పలువురు పలు రకాలుగా కామెంట్‌ చేస్తున్నారు. చిన్న పాపకు అప్పుడే పెళ్లి ఏంటని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుని పాపకు మాత్రం నువ్వు చూసిన అబ్బాయిని చేసుకోమంటే ఎలా అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌, అర్హ, స్నేహారెడ్డిలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

Funny Videos Of Allu Arjun And His Daughter About Her Marriage-Funny Mega Family Sneha Reddy Viral Viral In Social Media