గేదె సహాయంతో నోట్లను లెక్కపెడుతున్న వ్యక్తి ...వైరల్ వీడియో

మూగజీవాలు మనుషులతో ఎంత అనుబంధాన్ని కలిగి ఉంటాయో మనకు తెలిసిందే.మనుషులతో అవి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ, మనుషుల కంటే మూగజీవాలు ఎంతో నయమని ఇప్పుడున్న పరిస్థితులలో మనకు అర్ధమవుతున్న పరిస్థితి.

 Funny Video: Buffalo Help To Count Currency Notes,currency Notes,buffalo Tongue,-TeluguStop.com

ముఖ్యంగా మన ఇంట్లో పెంచుకునే మూగజీవాలు మనకు మన వ్యక్తిగత పనులకు సైతం సహాయపడుతూ మనకు కొంత ఊరటను కలిగిస్తాయి.కాని కొన్ని మూగజీవాలు వారి యజమానిపై చూపించే ప్రేమ ఆప్యాయతను, వారి బాధలను సైతం మర్చిపోయేలా చేస్తాయి.

అలా ఓ యజమాని తన వ్యక్తిగత పనులకు ఓ గేదె సహాయపడుతోంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే సాధారణంగా మనం నోట్లను ఎలా లెక్కపెడతాం.నోటి తడి ద్వారానో లేక మిషన్ ద్వారా లెక్కిస్తాం.కాని మీరు ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.

తన యజమాని నోట్ల లెక్కకు గేదె సహాయపడుతోంది.ఆ వ్యక్తి తాను నోట్లు లెక్కపెట్టుకోవడానికి గేదె నాలుకను ముట్టుకుంటూ నోట్లను లెక్కిస్తున్నాడు.

తాను చేయి చాచినప్పుడల్లా గేదె తన నాలుకను ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం.మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube