ఎన్టీఆర్, ఏఎన్నార్ ముందే మోహన్ బాబును పొగిడిన జనాలు..

Funny Incident About Anr Ntr And Mohan Babu, Anr, Mohan Babu, Ntr, Sardar Paparayudeu, Movie, Satyam Shivam Movie, People Praises Mohan Babu, Tollywood, Power Ful Dialogues, Dialogue King Mohan Babu

మోహన్ బాబు.టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.

 Funny Incident About Anr Ntr And Mohan Babu, Anr, Mohan Babu, Ntr, Sardar Papara-TeluguStop.com

ఎంత కష్టమైన డైలాగ్ ఇచ్చినా ఈజీగా చెప్పడంతో ఆయన దిట్ట.ఎన్టీఆర్ తర్వాత.

ఆరేంజిలో డైలాగులు చెప్పగల సత్తా ఉన్న నటుడు మోహన్ బాబు.ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాల్లో వీరి డైలాగులు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం సినిమాల్లో వీరు చెప్పిన డైలాగులను జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు.

సర్దార్ పాపారాయుడు సినిమాలో మోహన్ బాబు చేసింది చిన్న క్యారెక్టర్.

అయినా జనాలకు బాగా నచ్చింది.అందులో పప్పారాయుడూ అంటూ ఎన్టీఆర్.

మోహన్ బాబును పిలిచే విధానం జనాల్లోకి బాగా వెళ్లింది.ఆ సినిమాలో మోహన్ బాబు బ్రిటీష్ అధికారి పాత్రలో నటించాడు.

మా వంట‌లు చేసేవాడు భార‌తీయుడు., మా దీపాలు వెలిగించేవాడు భార‌తయుడు, మా తోట‌మాలి భార‌తీయుడు, మా బ‌ట్ట‌లుతికేవాడు భార‌తీయుడు.

అని మోహన్ బాబు చెప్పే డైలాగ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

అటు రామారావు, నాగేశ్వర్ రావు కలిసి స‌త్యం శివం అనే సినిమా చేశారు.

ఇందులో మోహన్ బాబు నటించాడు.ఈ సినిమాను ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు నిర్మించాడు.

Telugu Dialoguemohan, Mohan Babu, Ful Dialogues, Satyam Shivam, Tollywood-Telugu

ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరిగింది.అదే సమయంలో లొకేషన్ కు రామారావు, నాగేశ్వర్ రావు, మోహన్ బాబు ఒకే కారులో వెళ్లారు.దారిలో ఒక చోట వీరి కారును ఆపారు.మోహన్ బాబు కిందికి దిగాడు.అక్కడే ఉన్న కొందరు జనం ఆయను చూసి పప్పారాయుడు, పప్పారాయుడు అంటూ అరిచారు.ఆ ఘటన చూసి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఆశ్చర్యపోయారు.

ఏంటీ వీరిందరికీ డబ్బులు ఇచ్చావా.? నిన్న బాగా పొగుడుతున్నారని ఎన్టీఆర్ జోక్ చేశాడు.అప్పుడు కారులోని వారంతా నవ్వారు.అనంతరం అక్కడున్న జనాలకు అభివాదం చేస్తూ కారులో లొకేషన్ కు వెళ్లారు ముగ్గురు మేటి నటులు.ఆ జనాల పిలుపు తర్వాత తనకు ప్రజల్లో ఉన్న క్రేజ్ కు మోహన్ బాబు ఎంతో సంతోషపడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube