పుట్టింటికి వెళ్ళిన భార్య తన భర్తకి వాట్సాప్ లో ఏం మెసేజ్ చేసిందో తెలుసా..? చూస్తే నవ్వాపుకోలేరు!     2018-05-19   02:04:35  IST  Raghu V

వివాహంతో రెండు శ‌రీరాలు మాత్ర‌మే కాదు, రెండు మ‌న‌స్సులు కూడా ఒక్క‌ట‌వుతాయి. దీంతో దంప‌తులిద్ద‌రూ జీవితాంతం అలా ఒకే మ‌న‌స్సులా మారి జీవిస్తారు. ఎలాంటి క‌ష్ట‌, న‌ష్టాలు వ‌చ్చినా, సుఖం, దుఃఖం క‌లిగినా ఇద్ద‌రూ షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆద‌ర్శ దాంప‌త్యం అంటారు. ఇలాంటి దంప‌తులు ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కూడా.కాకపోతే చిన్నప్పటి నుండి మనం భార్య భర్తల మధ్య జరిగే సరదా సంభాషణలపై జోకులు చూస్తూనే ఉన్నాము, నవ్వుకుంటూనే ఉన్నాము. వాస్తవానికి అవి కొంచెం దూరంగా ఉన్నా, బిజీగా టెన్సన్స్ లో ఉండే మన పెదాలపైకి చిరునవ్వును తీసుకొస్తాయి. అలాంటి ఒక ప్రయత్నంలో భాగంగానే సరదాగా ఇలా రాయడం జరిగింది. పుట్టింటికి వెళ్లే ముందు ఓ భార్య తన భర్తకి వాట్సాప్ లో ఏమని మెసేజ్ చేసిందో చూడండి!
1. పనిమనిషికి జీతం ఇచ్చేశాను. నేను ఊరినుండి వచ్ చిందాకా పనిమనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది. 😜😜

2. 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెందలాడే పడుకోండి. మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి. అది నా తో పాటు హాండ్ బాగ్ లోఉంది. 😄😄😄😄😄

౩. మీరు చాలా హెల్దీ గా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు. 😁😁😁😁😁

4. మీ కోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది. పిజ్జా బిల్లులు చాలా దొరికాయి. 😱😱😱😱😱

5. మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం. అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విశేస్ చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. అది మీకోసమే అని నా నమ్మకం. 😡😡😡😡😡😡😡