కొన్నిసార్లు సరదా మాటలు కొంపలు ముంచే పనులు చేస్తాయి.వ్యక్తుల మధ్య తీవ్ర విబేధాలకు కారణం అవుతాయి.
నవ్వించాలని చేసే ప్రయత్నాలు బెడిసికొట్టి పెద్ద వివాదాల వరకూ వెళ్తాయి.అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వాణిశ్రీ, విజయనిర్మల వివాదం.36 ఏండ్ల క్రితం జరిగిన ఈ గొడవకు సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1975లో మొట్ట మొదటి సారి ప్రపంచ తెలుగు మహా సభలు జరిగాయి.ఈసభల ఏర్పాటుకు విరాళాన్ని ఇవ్వాలని తెలుగు సినిమా కళాకారుల సంఘం నిర్ణయించింది.ఈ డబ్బు కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చి డబ్బులు పోగు వేయాలని అనుకుంది.
అనుకున్నట్లుగానే సంఘం సభ్యులంతా ఓ పది రోజుల పాటు ప్రదర్శనలు ఇచ్చారు.అందులో భాగంగానే హీరోయిన్లు వాణిశ్రీ, కాంచన కలిసి అత్తాకోడలు అనే నాటకం వేశారు.ఇందులో అత్తగా వాణిశ్రీ లక్ష్మిదేవిగా, కోడలుగా కాంచన సరస్వతిగా నటించింది.నాటకంలో భాగంగా భూలోకంలో ఉన్న లక్ష్మిని చూసి ఏం అత్తా ఇలా వచ్చావ్ అంటుంది సరస్వతి.
ఒక ఊళ్లో ప్రేమ నగర్ సినిమా చూడ్డానికి, మరో ఊళ్లో మంచివాడు సినిమా చూడ్డానికి వచ్చానని చెప్తుంది.ఈ మాటలకు జనాలు విపరీతంగా నవ్వారు.
ఈ ప్రదర్శనల సమయంలో ఎన్టీఆర్, వాణిశ్రీ నటించిన కధానాయకుని కథ విడుదల అయ్యింది.అదే సమయంలో కధానాయకుడి కథ సినిమా టికెట్టు తేవాలని నారదుడిని పంపాను అంటుంది వాణిశ్రీ.
ఈ మాటతో అసలు లొల్లి మొదలయ్యింది.
అదే స్టేజి మీద విజయనిర్మల కూడా ఉంది.కృష్ణ హీరోగా ఆమె దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమా కూడా విడుదల అయ్యింది.ఆ సినిమాకు కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
దాన్ని మనసులో పెట్టుకునే వాణిశ్రీ తనను హేళన చేసేలా మాట్లాడిందని భావించింది.మద్రాసుకు రాగానే వాణిశ్రీ మీద తను కంప్లైంట్ చేసింది.
అదే సమయంలో కళాకారుల సంఘం అధ్యక్షుడిగా గుమ్మడి ఉన్నాడు.విజయనిర్మల ఫిర్యాదులో న్యాయం ఉందని భావించి వాణిశ్రీ వివరణ కోరాడు.
అయితే తనకు ఎవరినీ హేళన చేసే ఉద్దేశం లేదని ఆమె వివరణ ఇచ్చింది.వెంటనే వాణిశ్రీ సారీ చెప్పాలని సంఘం నుంచి లేఖ వెళ్లింది.
దీంతో జగ్గయ్య వివాదంలోకి ఎంట్రీ అయ్యాడు.ఇరువర్గాలను శాంతిపజేసి రాజీ కుదిర్చాడు.