దీపికా, రణవీర్‌ పెళ్లి ఫోటోలు ఇవిగో..! ఆ ఫోటోలపై ట్రెండ్ అయిన ఈ జోక్స్ చూస్తే నవ్వాపుకోలేరు!

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ దీపికా-రణవీర్‌సింగ్‌ పెళ్లి ఫోటోల కోసం ప్రపంచమంతా కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసింది.ఎపుడెపుడు వారి వేడుక ఫోటోలను చూడాలా అని ఈ జంట అభిమానులతో పాటు సినీలోకమంతా ఆసక్తిగా నెట్‌లో వెతుకులాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో.

 Funniest Reactions To Deepika Padukone Ranveer Singhs Wedding Photos1-TeluguStop.com

చివరికి ఈ ఫోటోలు దర్శనమిచ్చాయి.స్వయంగా కొత్త పెళ్లి కూతురు దీపికా తన ట్విటర్‌ పోస్ట్‌ చేసి వేడుక చేసింది.అభిమానుల ముచ్చట తీర్చింది.అటు రణవీర్‌సింగ్‌ కూడా ట్విటర్‌లో అవే ఫోటోలను పోస్ట్‌ చేయడం విశేషం.దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారిపోయాయి.

ఇటలీలో అత్యంత ఆర్భాటంగా ఈ వివాహ వేడుక జరిగినా.అక్కడి నుంచి ఒక్క ఫోటో బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు.నవంబర్‌ 12 నుంచే పెళ్లి పనులు ప్రారంభమైనా దీపికా, రణ్‌వీర్‌లు తమ పెళ్లికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే వరకు ఒక్క ఫోటో కూడా అభిమానులు చూడలేకపోయారు.

పెళ్లి అప్‌డేట్స్‌ కోసం ఎదురు చూసి చూసి విసుగెత్తుకొచ్చిన కొందరు నెటిజన్లు తమ క్రియేటివిటీకి పనిపెట్టారు.దీపికా, రణ్‌వీర్‌ల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నామో అర్థం వచ్చేలా ఫన్నీ మేమ్స్‌ క్రియేట్‌ చేసి ట్రెండ్‌ చేస్తున్నారు.

దీపిక, రణ్‌వీర్‌ల పెళ్లి వేడుక నవంబర్‌ 14, 15 తేదీల్లో ఇటలీలో సింధ్‌, కొంకణ్‌ సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే.ఆరేళ్లుగా వీరిమధ్య సాగిన అనుబంధం పెళ్లి పీటలకు చేరడంతో బాలీవుడ్‌ ప్రముఖులంతా కొత్త జంటను అభినందనల్లో ముంచెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube