దారుణం : కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి మృత దేహాలను ఎంత దారుణంగా…

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తూ  తన ప్రతాపం చూపిస్తుంటే మరోవైపు కరోనా వైరస్ సోకి మరణించిన వ్యక్తుల మృతదేహాల అంత్య క్రియలు నిర్వహించే విషయంలో స్మశాన వాటిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని ఓ స్మశానవాటికలో కరోనా వైరస్ సోకి మరణించిన వ్యక్తికి స్మశానవాటిక అధికారులు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా సగం కాలిన శవాన్ని కుక్కలు పీక్కు తింటున్న సంగతి మరవక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ భారిన పడి మృతి చెందినటువంటి మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించే విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారు.

ఇందులో భాగంగా కరోనా మృతదేహాలను చేతులతో ముట్టుకోకుండా ప్రొక్లైన్ లను ఉపయోగించి పెన్నా నది పరివాహక ప్రాంతంలో గోతులు తీసి ఖననం చేశారు.

ఇదంతా గమనిస్తున్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు.

అంతేగాక మనిషి బ్రతికున్నప్పుడు ఎలాగో గౌరవ,మర్యాదలు ఇవ్వడం లేదు కనీసం చనిపోయినవారికైనా గౌరవంగా అంతక్రియలు నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక కరోనా వైరస్ సోకి మృతి చెందిన వ్యక్తుల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులను ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా 23,814 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అయితే ఇందులో 12000 పైచిలుకు మంది విజయవంతంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకోగ మరో 277 మంది మృత్యువాత పడ్డారు.

చిరంజీవి వస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తే మేకప్ మేన్ వచ్చాడట.. ఏం జరిగిందంటే?