ఇద్దరు ప్రాణాలు తీసిన సరదా... పెళ్లింట విషాదం

సముద్రస్నానం సరదా ఇద్దరు ఉసిరి తీసింది.ఈ ఘటనతో వినాయక చవితి పండుగ రోజు ఒక పెళ్లి ఇంట విషాదం నిండింది.

 Fun That Took Two Lives A Wedding Tragedy-TeluguStop.com

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో  ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం మర్రిపూడి మండలం గ్రామంలో గురువారం మోయిడి మాధవ కూతురు వివాహం జరిగింది.

ఆ వివాహానికి చీమకుర్తి మండలం చిన్న రాగిపాడు గ్రామానికి చెందిన అబ్బాయి తరపు వారు హాజరయ్యారు.పెళ్లి తర్వాత రోజు వినాయకచవితి పండుగ కావడంతో పూజ ముగించుకుని సరదాగా సమీపంలోని పాకాల బీచ్ కి బైక్ లపై ఆరుగురు కలిసి వెళ్లారు.

 Fun That Took Two Lives A Wedding Tragedy-ఇద్దరు ప్రాణాలు తీసిన సరదా… పెళ్లింట విషాదం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన పెళ్ళి కమార్తె అన్న మోయిడి శాంతి రాజు(20), మోయిడి కోటేష్, కొమ్ము లాజర్, కొమ్ము పాల్, చీమకుర్తి మండలం గ్రామానికి చెందిన తేజ్ (18), జెన్నిపోగు యాప్రాయం సముద్రంలో దిగారు.

అలల తాకిడి తక్కువగా ఉండటంతో కాస్త లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు.

ఆ క్రమంలో శాంతిరాజు, తేజ్, యాప్రాయం సముద్రంలో గల్లంతయ్యారు.గమనించిన మిగతా యువకులు పెద్దగా కేకలు వేయడంతో ఒడిలోనే ఉన్న మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేశారు.

ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేశారు.చికిత్స చేస్తుండగానే శాంతిరాజు ప్రాణాలు వదిలాడు.

యాప్రాయం మాత్రం స్పృహలోకి వచ్చి తేరుకున్పాడు.తేజ మృతదేహం కొద్దిసేపటికే అలలపై తేలుతూ కనిపించడంతో ఒడ్డుకు చేర్చారు. మృతుల్లో శాంతిరాజు పెళ్లి కూతురు అన్న.అప్పటి వరకూ సరదాగా ఉన్న పెళ్లి ఇంటా రోదనలు మిన్నంటాయి.సింగరాయకొండ సీఐ మర్రి లక్ష్మణ్ పాకాల బీచ్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఎస్ఐ ఎల్.సంపత్ కుమార్ కేసు నమోదు చేశారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు

.

#Singaraya Konda #Pakal Beach #Marrege #Andra Pradesh #Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు