మొదట్లో యూట్యూబ్లో తమ నటనా ప్రతిభను నిరూపించుకుని సినిమా పరిశ్రమకి నటీనటులుగా పరిచయమైన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇందులో ఫన్ బకెట్ ఫన్నీ వీడియోల ద్వారా పాపులర్ అయినటువంటి “మహేష్ విట్ట” గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే మహేష్ విట్ట గత ఏడాది జరిగినటువంటి బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేగాక అప్పుడప్పుడు పలు చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.
అయితే తాజాగా మహేష్ విట్ట ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా సినిమా పరిశ్రమలో మహిళలతో పాటు మగవాళ్లు కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో తన స్నేహితుడు మంచి పర్సనాలిటీ కలిగి ఉండేవాడిని దాంతో సినిమాలో హీరో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు పిలిచి అవకాశం ఇస్తామని కానీ అందుకు బదులుగా తమకు కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారట.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా పరిశ్రమలోని యువ నటీనటులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అని.
అయితే కొంత మంది నటనపై ఉన్నటువంటి ఆసక్తితో కేవలం అవకాశాలు ఇస్తే చాలని ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కూడా నటిస్తారని తెలిపారు.కానీ కొంతమంది మాత్రం సినిమాలే తమ ప్రపంచంగా భావిస్తూ అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని అలాంటి వారిని కొంతమంది లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తారని అలంటి వాళ్ళతో కొంతమేర జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు.
అలాగే తమలో టాలెంట్ లేకుంటే అడ్డుదారుల్లో అవకాశం దక్కించుకున్నా ఉపయోగం ఉండదని కాబట్టి కష్టపడి పని చేసేవారు ఎక్కడైనా సినీ అవకాశాలు దక్కించుకుంటారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.