నెట్ ఫ్లిక్స్ లో సినిమా రిలీజ్ అంటూ ఫన్ బకెట్ భార్గవ్ ప్రకటన!

సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలో మంచి సెలబ్రేటీ హోదాను అందుకున్న ఫన్ బకెట్ భార్గవ్ అంతే త్వరగా తన కెరీర్ ను నాశనం చేసుకుని అందరిలో వేలెత్తి చూపించుకునేలా చేసుకున్నాడు.గతంలో ఓ మైనర్ బాలికను లొంగదీసుకొని ఆ బాలికను గర్భవతిని చేసి కొన్ని రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

 Fun Bucket Bhargav Announces Movie Release In Ott, Fun Bucket Bhargav, Netflix,-TeluguStop.com

ఇక ఇటీవలే బయటకు వచ్చిన భార్గవ్ కేసు మాత్రం విచారణ లోనే ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా గురించి ప్రకటన చేశాడు.

సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోస్ చేసే మంచి గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్.యూట్యూబ్ లో ఫన్ బకెట్ పేరుతో వీడియోలు చేసేవాడు.అంతేకాకుండా తనతో పాటు మరికొంతమంది అమ్మాయిలతో కూడా వీడియోలు చేసేవాడు.అలా అతి తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

కానీ తన గుర్తింపు మాత్రం క్షణాల్లో రోడ్డున పడేసుకున్నాడు.టిక్ టాక్ వీడియో లో పరిచయం అయిన 14 ఏళ్ల బాలికకు అవకాశాలు ఇస్తానని చెప్పి ప్రపోజ్ చేశాడు.

ఆ తర్వాత లొంగదీసుకొని గర్భవతిని చేయడంతో ఇతడిపై దిశ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.కొన్ని రోజులు జైలు లో ఉండి ఇటీవలే బయటకు రాగా మళ్లీ సోషల్ మీడియాలో అడుగు పెట్టి పోస్టులు చేస్తున్నాడు.

తాను తప్పు చేయలేదు అన్నట్లు కొన్ని వీడియోలు పంచుకున్నాడు.

Telugu Amazon Prime, Minor, Negtive, Netflix, Tiktok-Movie

అంతేకాకుండా సపోర్ట్ చేయమని నెటిజన్లను కోరాడు.కానీ నెటిజన్లు అతడిపై తెగ ఫైర్ అయ్యారు.ఇక తాజాగా మరో వీడియో పంచుకుంటూ.

మీరు తన కేసులను సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నాడు.అసలు పేరు చిప్పాడ భార్గవ్ అని కానీ ఫన్ బకెట్ పేరు కోసం ఎంతో కష్టపడ్డాను అని తెలిపాడు.

ఇక ప్రస్తుతం తను సంపాదించే డబ్బులు తనను నమ్ముకున్న వాళ్ళకి అని తెలిపాడు.ఇక తను దర్శకుడిగా కావాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టానని తెలిపాడు.

Telugu Amazon Prime, Minor, Negtive, Netflix, Tiktok-Movie

ఇక ఆ అవకాశం ఇన్నాళ్లకు వచ్చిందని.ఇక తను ఒక సినిమా చేస్తున్నానని తెలిపాడు.ఆ సినిమాను ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫిక్స్ లలో ఏదో ఒక దానిలో విడుదల చేయడానికి అవకాశం ఉందని తెలిపాడు.ఇక తనకు నిర్మాతలు దొరికాడని తెలిపాడు.

మొత్తానికి ఈ మాటలతో మల్లి తెగ నెగెటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube