ఫుల్ స్వింగ్ లో 'గాడ్ ఫాదర్' మ్యూజిక్ సెషన్ స్టార్ట్!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.ఈ సినిమా తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

 Full Swing On Chiranjeevi Godfather Music Sessions Details, God Godfather Latest-TeluguStop.com

మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఇటీవలే ఊటీ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.

ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాణ సంస్థ అయినా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి థమన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ సినిమా మ్యూజిక్ సెషన్ స్టార్ట్ చేసాడని థమన్ తెలిపాడు.

తాజాగా డైరెక్టర్ మోహన్ రాజా, డీఓపీ నీరవ్ షా తో కలిసి ఈ సినిమా గురించి చర్చించినట్టు తెలుస్తుంది.

Telugu Acharya, Bhola Shankar, Dop Neerav Sha, Fullchiranjeevi, God, God Music,

ఆ తర్వాత వీరితో కలిసి దిగిన ఫోటోను నెట్టింట పోస్ట్ చేసాడు.గాడ్ ఫాదర్ మ్యూజిక్ సెషన్ ఫుల్ స్వింగ్ లో ఉందంటూ థమన్ తన పోస్ట్ ద్వారా తెలిపారు.ఇక చిరంజీవి ఈ సినిమా కంటే ముందు ఆచార్య సినిమాలో నటించాడు.

Telugu Acharya, Bhola Shankar, Dop Neerav Sha, Fullchiranjeevi, God, God Music,

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు.ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దేంతో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమా కూడా ప్రకటించాడు.గాడ్ ఫాదర్ పూర్తి అవ్వగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube