ఇక బీజేపీపై ఫుల్ ఫోక‌స్‌.. టార్గెట్ మార్చిన కేసీఆర్‌

దేశం దృష్టిని ఆక‌ర్శించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం కేసీఆర్‌కు బాగానే ఎఫెక్ట్ చూపిన‌ట్టు క‌నిపిస్తోంది.ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టినా చివ‌ర‌కు ఈట‌ల గెలుపును ఆప‌లేక‌పోయారు.

 Full Focus On Bjp.. Kcr Changed The Target, Kcr, Bjp,latest News-TeluguStop.com

ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా బీజేపీని ఓడిస్తే రాష్ట్రంలో బీజేపీకి భ‌విష్య‌త్ లేద‌ని చెప్పాల‌నుకుంటే ఆయ‌న వ్యూహాలు తారుమార‌య్యాయి.కేసీఆర్ కు పెద్ద షాక్ ఇస్తూ బీజేపీ విజ‌య కేత‌నం ఎగ‌రేయ‌డంతో ఇది కాస్తా కేసీఆర్ కు పెద్ద త‌ల‌నొప్పులు త‌ప్ప‌ట్లేదు.

అయితే ఈ గెల‌పుతో రాష్ట్ర వ్యాప్తంగా బ‌ల‌ప‌డేందుకు బీజేపీకి పెద్ద ఛాన్స్ దొరికిన‌ట్ట‌యింది.

కాగా ఇప్ప‌టి నుంచే బీజేపీని టార్గెట్ చేసి వారి పాల‌న‌లో చేసిన త‌ప్పిదాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు కేసీఆర్ డిసైడ్ అయిపోయినట్టు క‌నిపిస్తోంది.

నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేవ‌లం బీజేపీని మాత్ర‌మే టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు.కేంద్రంలో బీజేపీ చేస్తున్న ప్రజా వ్య‌తిరేక ప‌నుల‌పై ఈసారి బ‌లంగా గ‌ళం వినిపించారు.

వాస్త‌వం చెప్పాలంటే కేంద్రం తీసుకుంటున్న అనేక నిర్ణ‌యాల‌పై ఇప్ప‌టి దాకా కాస్త సైలెంట్ గానే ఉంటున్న కేసీఆర్ స‌డెన్ గా రూటు మార్చారు.దేశంలో పెట్రోల్ ధ‌ర‌ల‌పై, జీడీపీపై బీజేపీని ఏకిపారేశారు.

Telugu Bandi Sanjay, Eetala Rajendar, Tg, Tg Politlcs-Telugu Political News

చివ‌ర‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి వెన‌క‌బ‌డ్డ దేశాలు కూడా ఈ రోజు ఇండియాను జీడీపీలో మించిపోయాయ‌ని చెప్ప‌డం చూస్తుంటే ఆయ‌న బీజేపీని ఎంత‌లా టార్గెట్ చేశారో అర్థం అవుతుందని.ఇక‌పోతే పెట్రోల్ ధరలపై కూడా నిప్పులు చెరిగారు కేసీఆర్‌.ఇష్టం వ‌చ్చిన‌ట్టు రేట్లు పెంచుకుంటూ పోతున్నార‌ని, అలా ఎల్ ఐసీని ఎందుకు అమ్ముతున్నార‌ని ఇలా ప‌దే ప‌దే కేసీఆర్ కేంద్ర ప‌నితీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌పోతే వ‌రి కొనుగోలుపై ఢిల్లీకి వెళ్లి ధ‌ర్నా చేస్తామంటూ ప్ర‌క‌టించ‌డాన్ని చూస్తే బీజేపీపై ఎంత సీరియ‌స్ గా ఉన్నారో అర్థం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube