దసరా బరిలో అరడజను.. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

టాలీవుడ్‌ ప్రేక్షకులకు పండగ వస్తుంది అంటే ఫుల్‌ వినోదం.ముఖ్యంగా సంక్రాంతి మరియు దసరా పండుగల సమయంలో తెలుగు రాష్ట్రాల విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున సెలవులు ఉంటాయి.

 Full Entertainment For This Dasara Festival-TeluguStop.com

దాంతో చిత్రాల విడుదల ఎక్కువగా ఉంటుంది.ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్‌ వృదా అయ్యింది.

విడుదలైన మూడు సినిమాలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడటం జరిగింది.ఇక సమ్మర్‌ సీజన్‌ను సద్వినియోగం చేసుకున్న స్టార్స్‌ ఇప్పుడు దసరా సీజన్‌పై పడబోతున్నారు.

అక్టోబర్‌లో దసరా సందర్బంగా ఇప్పటికే ఆరు చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

దసరా బరిలో మొదట నిలిచిన చిత్రం ‘అరవింద సమేత’.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయబోతున్నట్లుగా మొదలు పెట్టిన సమయంలోనే ప్రకటించారు.వచ్చే నెలలో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్‌ మూడవ వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.రవితేజ, శ్రీనువైట్లల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని కూడా దసరాకు విడుదల చేసే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

శ్రీనువైట్ల మరియు రవితేజలకు ఈ చిత్రం లైఫ్‌ అండ్‌ డెత్‌ మ్యాటర్‌.తాజాగా రామ్‌ హీరోగా నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని కూడా దసరాకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చేసింది.

రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం దసరా బరిలోకి రావడంతో పోరు పెరిగినట్లయ్యింది.ఖచ్చితంగా దసరాకు పోటీ తీవ్రంగా ఉండటంతో పాటు ప్రేక్షకులు ఫుల్‌ ఎంటర్‌టైన్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.ప్రస్తుతం హలో గురు ప్రేమకోసమే చిత్రం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ చిత్రాలతో పాటు శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న పడిపడి లేచే మనసు కూడా విడుదల కాబోతుంది.

వీటన్నింటికి తోడు నాగార్జున, నానిలు కలిసి నటిస్తున్న మోస్ట్‌ క్రేజీ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌ ‘దేవదాస్‌’ కూడా దసరాకు విడుదల కాబోతుంది.ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇలా పలు చిత్రాలు దసరా బరిలో నిలుస్తున్నాయి.దసరాకు దాదాపుగా మూడు నెలల సమయం ఉంది కనుక ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది.

ఇందులో దసరా విజేతలు ఎవరు అనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube