నేటి నుంచే సంజయ్ పాదయాత్ర ! పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ టిఆర్ఎస్ , బిజెపి ,కాంగ్రెస్ లు పోటా పోటీగా జనాల్లోకి వెళ్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

 Full Details Of Bandi Sanjay Praja Sangrama Padayatra Details, Bandi Sanjay, Tel-TeluguStop.com

ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ బిజెపి నాయకులు యాక్టిివ్ గా ఉంటున్నారు.ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే రెండుసార్లు ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించారు.

మూడో విడత యాత్రను నేడు యాదాద్రి నుంచి ఆయన ప్రారంభించనున్నారు.ఈ పాదయాత్ర ద్వారా జనాల్లోకి బిజెపిని తీసుకువెళ్లడంతో పాటు , ప్రజా సమస్యల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వంను ఇరుకున పెట్టే విధంగా వ్యవహారాలు చేసేందుకు బండి సంజయ్ ఉత్సాహంగా ఈ యాత్రను ఎంచుకున్నారు.

ఇప్పటికే రెండు విడుదల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది .మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించనున్నారు.ఈ యాత్ర ద్వారా బిజెపి మరింతగా బలపడే అవకాశం ఉందనే ఉద్దేశం తో బీజేపీ పెద్దలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు.ఈ మేరకు నేడు యాత్ర ప్రారంభ సభకు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరు కాబోతున్నారు.
 

Telugu Bandi Sanjay, Congress, Kishan Reddy, Telangana Bjp-Political

ఈరోజు ఉదయం 10 గంటలకు యాదాద్రి చేరుకోబోతున్న బండి సంజయ్ కేంద్ర మంత్రులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు నిర్వహించి అనంతరం 11 గంటలకు ఏర్పాటు చేసిన యాదగిరి పల్లి లోని బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు.కేంద్రమంత్రి గజేందర్ సింగ్ షకావత్ పార్టీ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు.యాదాద్రి నుంచి మొదలు కాబోయే మూడో విడత ప్రజా సంకరమయాత్ర జనగామ జిల్లా మీదుగా వరంగల్ చేరుకుంటుంది.మొత్తం 24 రోజులపాటు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube